శంకరాభరణం టైటిల్‌తో... | Sankarabharanam movie telugu Title | Sakshi
Sakshi News home page

శంకరాభరణం టైటిల్‌తో...

Published Wed, Sep 24 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

శంకరాభరణం టైటిల్‌తో...

శంకరాభరణం టైటిల్‌తో...

 ‘శంకరాభరణం’... తెలుగు తెరపై ఓ క్లాసిక్.జేవీ సోమయాజులు, మంజు భార్గవి, బేబీ తులసి ముఖ్యతారలుగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలై ఇప్పటికి 35 ఏళ్లయినా ప్రేక్షకుల మనోఫలకాలపై శాశ్వతంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ ప్రస్తావన దేనికంటే... ‘శంకరాభరణం’ టైటిల్‌తో తెలుగులో మరో సినిమా రూపొందనుంది. రచయిత కోన వెంకట్ ఈ టైటిల్‌తో స్క్రిప్టు సిద్ధం చేశారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇటీవలే అంజలి కథానాయికగా ‘గీతాంజలి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తీసిన ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. కోన వెంకట్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలుకానుంది. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలుస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement