మరోసారి ‘పథేర్ పాంచాలి’ | Satyajit Ray's classic 'Pather Panchali' to be screened at Cannes | Sakshi
Sakshi News home page

మరోసారి ‘పథేర్ పాంచాలి’

Published Sat, Apr 25 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

మరోసారి ‘పథేర్ పాంచాలి’

మరోసారి ‘పథేర్ పాంచాలి’

భారతదేశం గ ర్వించదగ్గ దర్శకుల్లో  సత్యజిత్ రే ఒకరు. ఆయన తీసిన తొలి సినిమా ‘పథేర్ పాంచాలి’ ఏకంగా 11 అంతర్జాతీయ అవార్డులను సాధించడంతో పాటు 1956లో జరిగిన  కాన్స్ చిత్రోత్సవాల్లో ‘మానవ జీవితాన్ని తెరకెక్కిం చిన ఉత్తమ సెల్యులాయిడ్ డాక్యుమెంట్’గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది.
 
 మే రెండోవారం నుంచి జరగనున్న కాన్స్ చిత్రోత్సవాల్లో ‘క్లాసిక్ చిత్రాల’ విభాగంలో ఈ చిత్రాన్ని మళ్లీ ప్రదర్శించనున్నారు. అలాగే ఈ సినిమాతో పాటు సత్యజిత్ రే రూపొందించిన మరో రెండు చిత్రాలు ‘అపరాజితో’, ‘అపూర్ సంసార్’లను న్యూయార్క్‌లో విడుదల చేస్తున్నారు. నిజానికి, 1993లో లండన్‌లో జరిగిన ప్రమాదంలో ఈ చిత్రాల నెగెటివ్‌లు పాడయ్యాయి. నిపుణులు చేసిన కృషి వల్ల ఈ చిత్రాలు మళ్లీ పురుడు పోసుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement