Pather Panchali
-
టాప్ 100లో ‘పథేర్ పాంచాలి’
ప్రముఖ బీబీసీ చానల్ ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా ‘టాప్ 100 ఉత్తమ విదేశీ చి త్రాల’ జాబితాను రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే టాప్ 100 ఉత్తమ విదేశీ చిత్రాల్లో ఈ ఏడాది మన భారతీయ చిత్రం ‘పథేర్ పాంచాలి’కి స్థానం లభించింది. 1954లో అకీరా కురోసావా తెరకెక్కించిన జపనీస్ సినిమా ‘సెవెన్ సమురాయ్’ టాప్ 100లో తొలి స్థానంలో నిలిచింది. ప్రముఖ దర్శకులు సత్యజిత్ రే దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పథేర్ పాంచాలి’. 1955లో వచ్చిన ఈ చిత్రం టాప్ 100లో 15వ స్థానంలో నిలిచింది. రచయిత బీభూతి భూషణ్ బందోపాధ్యాయ్ 1929లో రాసిన ‘పథేర్ పాంచాలి’ అనే బెంగాలీ నవల ఆధారంగా సత్యజిత్ రే ఈ సినిమా తీశారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం.. మంచి కథ కావడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే ‘పథేర్ పాంచాలి’ నిర్మాణానికి నగదు ఇచ్చింది. -
నా ఉద్దేశంలో బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ అదే
ఫిల్మ్ ప్రిజర్వేషన్, ఫిల్మ్ పై సినిమాలు తీయడంలోని ప్రాముఖ్యత గురించిన ఈవెంట్లో పాల్గొనడానికి హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో క్రిస్టోçఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘ఇంటర్స్టెల్లార్, డంకర్క్’ సినిమాలను ప్రదర్శించారు. అలాగే నోలన్ కొన్ని ఇండియన్ సినిమాలు చూశారు. ఈ సందర్భంగా నోలన్ మాట్లాడుతూ –‘‘ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌ను కలవాలని, వాళ్ల స్టైల్ తెలుసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. ఈ ప్రయాణం ద్వారా అది నెరవేరింది. ఈ విజిట్‌లో సత్యజిత్ రే తీసిన ‘పథేర్ పాంచాలి’ (1955) సినిమా చూశాను. నా దృష్టిలో ‘పథేర్ పాంచాలి’ బెస్ట్ ఇండియన్ ఫిల్మ్. దర్శకుడు సత్యజిత్ రే చేసిన ఎక్స్ట్రార్డినరీ వర్క్ ఇది. ఫ్యూచర్లో మరికొన్ని ఇండియన్ సినిమాలు చూడాలనుకుంటున్నాను. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది. ఇప్పుడు ఇండియాకు రావటానికి అది కూడా ఒక కారణమే’’ అని అన్నారాయన. -
నా ప్రతీ సినిమా కాపీనే: షూజిత్ సర్కార్
షూజిత్ సర్కార్.. ప్రయోగాత్మక సినిమాలను ఇష్టపడే సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు.. సాధారణంగా కమర్షియల్ దర్శకులు కొన్ని కథల జోలికి వెళ్లడానికి కూడా భయపడతారు. అలాంటి కథలతో సంచలనాలు సృష్టించే ఈ దర్శకుడు.. తాజాగా సంచలనాత్మక కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింట్‌ను కాపీ చేస్తానంటూ చెప్పిన షూజిత్.. ఆ విషయం మాత్రం సాధారణ ప్రేక్షకులకు అర్ధం కాకుండా జాగ్రత్త పడతానన్నాడు. లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే తీసిన 'పథేర్ పాంచాలి' సినిమా విడుదలై 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న షూజిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింటును 'పథేర్ పాంచాలి' స్ఫూర్తితోనే తెరకెక్కిస్తానని, నిజానికి రే తీసిన ప్రతి సినిమా భారతీయ సినీ పరిశ్రమకు బైబిల్ లాంటిదని అన్నాడు. మద్రాస్ కేఫ్, విక్కీ డోనార్, పికు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన షూజిత్ సర్కార్ ప్రస్తుతం అమితాబ్ ప్రధానపాత్రలో ఓ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు సినిమాలను ప్రకటించి.. వాటికి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
మరోసారి ‘పథేర్ పాంచాలి’
భారతదేశం గ ర్వించదగ్గ దర్శకుల్లో సత్యజిత్ రే ఒకరు. ఆయన తీసిన తొలి సినిమా ‘పథేర్ పాంచాలి’ ఏకంగా 11 అంతర్జాతీయ అవార్డులను సాధించడంతో పాటు 1956లో జరిగిన కాన్స్ చిత్రోత్సవాల్లో ‘మానవ జీవితాన్ని తెరకెక్కిం చిన ఉత్తమ సెల్యులాయిడ్ డాక్యుమెంట్’గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. మే రెండోవారం నుంచి జరగనున్న కాన్స్ చిత్రోత్సవాల్లో ‘క్లాసిక్ చిత్రాల’ విభాగంలో ఈ చిత్రాన్ని మళ్లీ ప్రదర్శించనున్నారు. అలాగే ఈ సినిమాతో పాటు సత్యజిత్ రే రూపొందించిన మరో రెండు చిత్రాలు ‘అపరాజితో’, ‘అపూర్ సంసార్’లను న్యూయార్క్‌లో విడుదల చేస్తున్నారు. నిజానికి, 1993లో లండన్‌లో జరిగిన ప్రమాదంలో ఈ చిత్రాల నెగెటివ్‌లు పాడయ్యాయి. నిపుణులు చేసిన కృషి వల్ల ఈ చిత్రాలు మళ్లీ పురుడు పోసుకున్నాయి.