నా ప్రతీ సినిమా కాపీనే: షూజిత్ సర్కార్ | all my films are copy, says shoojith sircar | Sakshi
Sakshi News home page

నా ప్రతీ సినిమా కాపీనే: షూజిత్ సర్కార్

Published Tue, Sep 1 2015 8:35 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

నా ప్రతీ సినిమా కాపీనే: షూజిత్ సర్కార్

నా ప్రతీ సినిమా కాపీనే: షూజిత్ సర్కార్

షూజిత్ సర్కార్.. ప్రయోగాత్మక సినిమాలను ఇష్టపడే సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు.. సాధారణంగా కమర్షియల్ దర్శకులు కొన్ని కథల జోలికి వెళ్లడానికి కూడా భయపడతారు. అలాంటి కథలతో సంచలనాలు సృష్టించే ఈ దర్శకుడు.. తాజాగా సంచలనాత్మక కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింట్ను కాపీ చేస్తానంటూ చెప్పిన షూజిత్.. ఆ విషయం మాత్రం సాధారణ ప్రేక్షకులకు అర్ధం కాకుండా జాగ్రత్త పడతానన్నాడు.

లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే తీసిన 'పథేర్ పాంచాలి' సినిమా విడుదలై 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కోల్కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న షూజిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింటును 'పథేర్ పాంచాలి' స్ఫూర్తితోనే తెరకెక్కిస్తానని, నిజానికి రే తీసిన ప్రతి సినిమా భారతీయ సినీ పరిశ్రమకు బైబిల్ లాంటిదని అన్నాడు.

మద్రాస్ కేఫ్, విక్కీ డోనార్, పికు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన షూజిత్ సర్కార్ ప్రస్తుతం అమితాబ్ ప్రధానపాత్రలో ఓ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు సినిమాలను ప్రకటించి.. వాటికి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement