
‘పథేర్ పాంచాలి’ లో ఓ దృశ్యం
ప్రముఖ బీబీసీ చానల్ ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా ‘టాప్ 100 ఉత్తమ విదేశీ చి త్రాల’ జాబితాను రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే టాప్ 100 ఉత్తమ విదేశీ చిత్రాల్లో ఈ ఏడాది మన భారతీయ చిత్రం ‘పథేర్ పాంచాలి’కి స్థానం లభించింది. 1954లో అకీరా కురోసావా తెరకెక్కించిన జపనీస్ సినిమా ‘సెవెన్ సమురాయ్’ టాప్ 100లో తొలి స్థానంలో నిలిచింది. ప్రముఖ దర్శకులు సత్యజిత్ రే దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పథేర్ పాంచాలి’. 1955లో వచ్చిన ఈ చిత్రం టాప్ 100లో 15వ స్థానంలో నిలిచింది. రచయిత బీభూతి భూషణ్ బందోపాధ్యాయ్ 1929లో రాసిన ‘పథేర్ పాంచాలి’ అనే బెంగాలీ నవల ఆధారంగా సత్యజిత్ రే ఈ సినిమా తీశారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం.. మంచి కథ కావడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే ‘పథేర్ పాంచాలి’ నిర్మాణానికి నగదు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment