top movies
-
ఆ పది సినిమాల్లో ఐదు మనవే
-
IMDb: ఈ ఏడాది టాప్ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో 'ఆర్ఆర్ఆర్'
ఈ ఏడాది ఇండియాలో టాప్ టెన్ మూవీస్‌లో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబి ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2022’ పేరుతో విడుదల చేసిన జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యంత భారీ బడ్జెడ్ ఆర్ఆర్ఆర్తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదటిస్థానంలో ఆర్ఆర్ఆర్, రెండోస్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, మూడోస్థానంలో కేజీఎఫ్-2, నాలుగో స్థానంలో విక్రమ్, ఐదో ప్లేస్‌లో కాంతార నిలిచింది. ఆ తర్వాత వరుసగా రాకెట్రీ, మేజర్, సీతారామం, పొన్నియిన్ సెల్వన్, చార్లీ 777 చిత్రాలు టాప్ టెన్‌లో స్థానం దక్కించుకున్నాయి. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు.. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ హీరో రిషబ్ శెట్టి చిత్రం కాంతార మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే బ్రహ్మరథం పట్టారు. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్- 2022 ఆర్ఆర్ఆర్ ది కశ్మీర్ ఫైల్స్ కేజీయఫ్-2 విక్రమ్ కాంతార రాకెట్రీ మేజర్ సీతారామం పొన్నియిన్ సెల్వన్ 777 చార్లీ Presenting the IMDb Top 10 Most Popular Indian Movies of the year 2022 🥁💛 How many of your favourites made it to the list?#IMDbBestof2022 pic.twitter.com/0GggT44fG8 — IMDb India (@IMDb_in) December 14, 2022 -
టాప్ 100లో ‘పథేర్ పాంచాలి’
ప్రముఖ బీబీసీ చానల్ ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా ‘టాప్ 100 ఉత్తమ విదేశీ చి త్రాల’ జాబితాను రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే టాప్ 100 ఉత్తమ విదేశీ చిత్రాల్లో ఈ ఏడాది మన భారతీయ చిత్రం ‘పథేర్ పాంచాలి’కి స్థానం లభించింది. 1954లో అకీరా కురోసావా తెరకెక్కించిన జపనీస్ సినిమా ‘సెవెన్ సమురాయ్’ టాప్ 100లో తొలి స్థానంలో నిలిచింది. ప్రముఖ దర్శకులు సత్యజిత్ రే దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పథేర్ పాంచాలి’. 1955లో వచ్చిన ఈ చిత్రం టాప్ 100లో 15వ స్థానంలో నిలిచింది. రచయిత బీభూతి భూషణ్ బందోపాధ్యాయ్ 1929లో రాసిన ‘పథేర్ పాంచాలి’ అనే బెంగాలీ నవల ఆధారంగా సత్యజిత్ రే ఈ సినిమా తీశారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం.. మంచి కథ కావడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే ‘పథేర్ పాంచాలి’ నిర్మాణానికి నగదు ఇచ్చింది. -
హ్యాపీ బర్త్‌డే సల్మాన్: టాప్ 5 సినిమాలివే!
'టైగర్ జిందా హై' సినిమాతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ బుధవారం 52వ పడిలో అడుగుపెట్టారు. సినిమా కథ, కథనంతో సంబంధం లేకుండా కేవలం సల్మాన్ నటిస్తే చాలు సినిమా హిట్టవ్వడం ఖాయమంటూ అభిమానులు సంబరపడిపోతారు. సల్మాన్‌కు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సల్మాన్ ఛరిష్మా రోజురోజుకీ పెరిగిపోతుందనేది వాస్తవం. గత దశాబ్దకాలంగా విడుదలైన సినిమాలు గమనిస్తే సల్మాన్ వివిధ రకాల పాత్రలతో అభిమానుల్ని ఆకట్టుకున్న తీరు స్పష్టమవుతుంది. వాంటెడ్ సినిమాలో రాధేగా, దబాంగ్ సినిమాలో చుల్బుల్ పాండేగా, ఏక్ థా టైగర్‌లో 'రా' ఏజెంట్‌గా వివిధ పాత్రలు పోషించి మెప్పించటం ఈ భాయీజాన్కే చెల్లింది. ఎన్ని సినిమాల్లో నటించినా.. ఎన్ని పాత్రలు పోషించినా.. కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తాయి. బర్త్‌డే సందర్భంగా సల్మాన్ కెరీర్లో టాప్ 5 పర్ఫార్మెన్స్పై ఓ లుక్కేద్దాం.. 1. మై నే ప్యార్ కియా సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన మొదటి సినిమా ఇది. 28 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఆ దశాబ్దంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సల్మాన్‌తోపాటు, భాగ్యశ్రీ, సూరజ్ బర్జాత్యా కెరీర్‌కు ఊపునిచ్చింది. ఈ ప్రేమకథాచిత్రంతో చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ‘ప్రేమ్’గా అమ్మాయిల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. 2. హమ్ ఆప్కే హై కౌన్ సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన ఈ కుటుంబ కథా చిత్రం 90వ దశకంలోని బిగ్గెస్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. కుటుంబం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయగల పాత్రకు జీవం పోసి, తాను కేవలం ప్రేమకథా చిత్రాలకే పరిమితం కాదని నిరూపించుకున్నాడు ఈ సల్మాన్.. 3. జుడ్వా లవర్‌బాయ్, ఫ్యామిలీమ్యాన్ పాత్రలే కాకుండా.. ఈ సినిమాలో కామిడీ పాత్రలో ఒదిగిపోయి ఏ పాత్రలోనైనా జీవించగలనని నిరూపించుకున్నాడు. ఇందులో సల్మాన్.. ప్రేమ్, రాజాగా ద్విపాత్రాభినయం చేసి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టాడు. 4. ఫిర్ మిలేంగే సల్మాన్ తన శైలికి పూర్తి భిన్నంగా, ఇమేజ్ పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. హెచ్ఐవీ పేషెంట్‌గా రోహిత్ పాత్రలో నటించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు. కొందరు ఈ పాత్రకు సల్మాన్ సూట్ అవలేదని విమర్శించినా తన నటనతో మెప్పించాడు. 5. బజ్రంగీ భాయీజాన్ హీరోగా కాకుండా ఒక నటుడిగా సల్మాన్‌ను మరో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. పాకిస్తాన్ నుంచి తప్పిపోయి వచ్చిన ఓ మూగ అమ్మాయిని తన తల్లిదండ్రుల చెంతకు చేర్చే ప్రయత్నంలో భాగంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడి ఆమెను గమ్యస్థానానికి చేరుస్తాడు. పవన్ కుమార్ చతుర్వేదిగా ఒక సామాన్య యువకుని పాత్రలో ఒదిగిపోయాడు సల్మాన్. -
బాహుబలిని ఢీకొట్టిన విక్రంవేదా.. దుమ్మురేపిన అర్జున్‌రెడ్డి, ఘాజీ!
2017లో విడుదలైన టాప్ -10 భారతీయ సినిమాల జాబితాను ప్రముఖ సినిమా సమాచార వెబ్సైట్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో బాహుబలి-2ను అధిగమించి తమిళ క్రైమ్ థిల్లర్ మూవీ 'విక్రమ్ వేదా' టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ జాబితాలో మూడు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. టాప్-10 ఇండియన్ సినిమాల్లో మొదటిస్థానంలో విక్రమ్ వేదా ఉండగా.. రెండో స్థానంలో రాజమౌళి వెండితెర దృశ్యకావ్యం 'బాహుబలి-2', కొత్త దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించిన ట్రెండ్ సెట్టర్ 'అర్జున్‌రెడ్డి' మూడోస్థానంలో ఉన్నాయి. రాణా దగ్గుబాటి హీరోగా కొత్త దర్శకుడు సంకల్ప్‌రెడ్డి రూపొందించిన 'ద ఘాజీ అటాక్' సినిమా ఆరోస్థానంలో నిలిచింది. ఐఎండీబీ యూజర్లు ఇచ్చిన రేటింగ్స్, రివ్యూల ఆధారంగా ఈ టాప్-10 జాబితాను ప్రకటించింది. ఇటు ప్రేక్షకులూ, అటు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలే ఈ జాబితాలో ఉండటం విశేషం. క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కి కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన 'విక్రమ్ వేదా' తొలిస్థానంలో నిలువగా, రాజమౌళి 'బాహుబలి-2' రెండోస్థానంలో నిలిచింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సాధించిన విజయం, కలెక్షన్ల ముందు 'విక్రమ్ వేదా' విజయం చిన్నదేనని చెప్పాలి. ఇక తెలుగు ట్రెండ్‌సెట్టర్, విజయ్ దేవరకొండను సూపర్‌స్టార్‌ను చేసిన 'అర్జున్‌రెడ్డి' ఈ జాబితాలో మూడోస్థానాన్ని దక్కించుకొంది. నాలుగోస్థానంలో ఆమిర్ఖార్ తెరకెక్కించి అతిథి పాత్ర పోషించిన 'సీక్రెట్ సూపర్‌స్టార్' నిలువగా.. ఇర్ఫాన్ ఖాన్, సబా ఖామర్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్"హిందీ మీడియం' ఐదోస్థానాన్ని దక్కించుకుంది. రాణా హీరోగా మూడు (హిందీ, తమిళం, తెలుగు) భాషల్లో విడుదలైన ఘాజీ సినిమా ఈ జాబితాలో ఆరోస్థానంలో నిలువగా.. ఇక, ఈ ఏడాది అక్షయ్ కుమార్ నటించిన రెండు సినిమాలు 'జాలీ ఎల్ఎల్బీ- 2', టాయ్‌లెట్ ఏక్ ప్రేమకథ.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. సామాజిక అంశాలు నేపథ్యంగా తీసుకొని తెరకెక్కిన 'టాయ్‌లెట్' ఏడో స్థానంలో నిలువగా.. కోర్టుడ్రామాగా తెరకెక్కిన జాలీ ఎల్ఎల్బీ-2 సినిమా ఎనిమిదో స్థానంలో నిలిచింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ భారీ బడ్జెట్ చిత్రం 'మెర్సల్' ఎనిమిదో స్థానంలో నిలువగా.. మమ్మూటీ, స్నేహ జంటగా తెరకెక్కిన మలయాళ మూవీ ది గ్రేట్ ఫాదర్ ఈ జాబితాలో పదోస్థానంలో నిలిచింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా ఈ సినిమా రీమేక్ కానున్నట్టు తెలుస్తోంది. -
ఈ యేటి మేటి చిత్రం.. ఆషికీ 2
హిందీలో అత్యధికంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలేవో తెలుసా? దీనికి ప్రమాణాలేంటని అనుకుంటున్నారా? వీక్షకులు గూగుల్‌లో ఎక్కువగా ఏయే సినిమాలను సెర్చ్ చేశారన్నదే ఇందుకు అతిపెద్ద ప్రమాణం. దాని ప్రకారం చూసుకుంటే, అగ్రస్థానంలో 'ఆషికీ 2' నిలిచింది. ఇది రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా. ఇందులో ప్రధానంగా 'అప్నే కరమ్ కీ కర్ అదాయే' అంటూ వచ్చే మొదటిపాట యూట్యూబ్‌లో ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తోంది. వివిధ రకాలుగా దీన్ని ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది యూట్యూబ్‌లో చూశారు. ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా, భూషణ్ కుమార్, ముఖేష్ భట్ నిర్మించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్ 3, ధూమ్ 3, హిమ్మత్వాలా, రేస్ 2, ఏబీసీడీ, భాగ్ మిల్కా భాగ్, దబాంగ్ 2, మద్రాస్ కేఫ్ నిలిచాయి. -
ఈ యేటి మేటి చిత్రం.. ఆషికీ 2
హిందీలో అత్యధికంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలేవో తెలుసా? దీనికి ప్రమాణాలేంటని అనుకుంటున్నారా? వీక్షకులు గూగుల్‌లో ఎక్కువగా ఏయే సినిమాలను సెర్చ్ చేశారన్నదే ఇందుకు అతిపెద్ద ప్రమాణం. దాని ప్రకారం చూసుకుంటే, అగ్రస్థానంలో 'ఆషికీ 2' నిలిచింది. ఇది రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా. ఇందులో ప్రధానంగా 'అప్నే కరమ్ కీ కర్ అదాయే' అంటూ వచ్చే మొదటిపాట యూట్యూబ్‌లో ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తోంది. వివిధ రకాలుగా దీన్ని ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది యూట్యూబ్‌లో చూశారు. ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా, భూషణ్ కుమార్, ముఖేష్ భట్ నిర్మించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్ 3, ధూమ్ 3, హిమ్మత్వాలా, రేస్ 2, ఏబీసీడీ, భాగ్ మిల్కా భాగ్, దబాంగ్ 2, మద్రాస్ కేఫ్ నిలిచాయి.