సెకండ్ హీరోయిన్‌గా తాప్సీ? | second heroine to Taapsee Pannu? | Sakshi
Sakshi News home page

సెకండ్ హీరోయిన్‌గా తాప్సీ?

Published Thu, Jul 17 2014 1:22 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

సెకండ్ హీరోయిన్‌గా తాప్సీ? - Sakshi

సెకండ్ హీరోయిన్‌గా తాప్సీ?

ప్రేమ, ప్రియురాళ్లు శాశ్వతం కాదన్నదానికి నటుడు శింబు, నటీమణి నయనతారలే ఉదాహరణ. ఒకప్పుడు వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. ఆ తరువాత లవ్ బ్రేక్ అప్ అన్నారు. తాజాగా మళ్లీ కలిసి నటిస్తున్నారు. వీరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ఇదు నమ్మ ఆళు అనే టైటిల్ నిర్ణయించారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెండవ హీరోయిన్ పాత్ర ఎవరు పోషించనున్నారన్న విషయమై రకరకాల ప్రచారం జరుగుతోంది. తొలుత ఈ చిత్రంలో శింబు మరో మాజీ ప్రియురాలు హన్సిక నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.

తాజాగా నటి తాప్సీ పేరు తెరపై కొచ్చింది. ఈ ప్రచారంపై తాప్సీ స్పందిస్తూ ఇదు నమ్మ ఆళు చిత్రంలో రెండ హీరోయిన్ ఆత్రను పోషించమని తనను చిత్ర యూనిట్ అడిగిన మాట వాస్తవమేనన్నారు. అయితే తానింకా ఓకే చెప్పలేదని అన్నారు. ఈ చిత్రంలో రెండో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. అయితే తాను ఇప్పటికే అంగీకరించిన చిత్రాలతో బిజీగా ఉన్నానని అందువల్ల ఇదు నమ్మ ఆళు చిత్రంలో నటించేది, లేనిది కచ్చితంగా చెప్పలేనని తాప్సీ తెలిపారు. దర్శకుడు పాండిరాజ్ మాత్రం తమ చిత్రంలో తాప్సీని నటించమని అడిగినట్లు ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement