
వంకాయల సత్యనారాయణ
ప్రముఖ సినీ, రంగస్థల సీనియర్ నటుడు, దర్శకుడు వంకాయల సత్యనారాయణ (78) ఇక లేరు. నటుడిగా సుమారు నాలుగు దశాబ్దాలపాటు వెండితెరపై విభిన్న పాత్రల్ని పండించిన ఆయన సోమవారం తన నివాసంలో మృతి చెందారు. కొద్ది కాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ విశాఖలోని తన కుమార్తె ఇంట్లో తుదిశ్వాస విడిచారు. 1940లో విశాఖపట్నం చవలవారి వీధిలో సత్యనారాయణ జన్మించారు.
ఆయనకు ఇద్దరు కుమార్తెలు. అనారోగ్యంతో బాధపడుతూ కుమార్తె ఇంట్లోనే ఉంటున్నారు. నెల క్రితం కళాభారతి ఆడిటోరియంలో ప్రదర్శించిన ఒక నాటకంలో ముఖ్యపాత్ర పోషించి మెప్పించారు. నడవలేని స్థితిల్లో ఉన్నా నాటకాలంటే ఆయనకు ఎంతో మక్కువ. నాటక రంగం నుంచే ‘నీడలేని ఆడది’ సినిమాతో చిత్ర రంగప్రవేశం చేశారు. సీతామాలక్ష్మీ, శ్రీనివాస కల్యాణం, శుభలేఖ, దొంగకోళ్లు, విజేత వంటి చిత్రాలతోపాటు 160కిపైగా చిత్రాల్లో, పలు సీరియల్స్‌లో నటించారు. వందలాది రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment