
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కో డైరెక్టర్‌గా, పలు చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన సీనియర్ టెక్నీషియన్ కె.రంగారావు అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించిన రంగారావు ఎన్నో దశాబ్దాలుగా టాలీవుడ్‌లో దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. ఇంద్రధనుస్సు సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన నమస్తే అన్న, బొబ్బిలి బుల్లోడు, ఉద్యమం, అలెగ్జాండర్ లాంటి సినిమాలతో దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు.
కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. దర్శకుల సంఘంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించిన రంగారావు మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం తెలియజేశారు. సోమవారం సాయంత్రం సూర్యపేట జిల్లా మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కె. రంగారావు (ఫైల్ ఫోటో)
Comments
Please login to add a commentAdd a comment