ఒకే రోజు 7 సినిమాలు | Seven Movies Releasing On 29th June | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 20 2018 10:51 AM | Last Updated on Wed, Jun 20 2018 1:39 PM

Seven Movies Releasing On 29th June - Sakshi

ఈ నెలాఖరున వెండితెర మీద సినిమా పండుగ కనిపించనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు జూన్‌ 29న రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. స్టార్‌ హీరోలు బరిలో లేకపోవటంతో చిన్న సినిమాలు వరుస రిలీజ్‌లకు క్యూ కడుతున్నాయి. అయితే ఒకేరోజు ఏడు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుండటంతో థియేటర్ల సమస‍్య తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు.

29న రిలీజ్‌ అవుతున్న సినిమాలో కాస్త హైప్‌ ఉన్న ఒకే ఒక్క సినిమా ‘ఈ నగరానికి ఏమైంది..?’ పెళ్లిచూపులు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. జబర్దస్త్‌ ఫేం షకలక శంకర్‌ హీరోగా తెరకెక్కిన శంభో శంకర కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్‌ గట్టిగా చేస్తుండటంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది.

నందు హీరోగా తెరకెక్కిన కన్నుల్లో నీ రూపమే, గ్రాఫిక్స్‌ ప్రధానంగా రవి వీడే దర్శకత్వంలో తెరకెక్కిన సంజీవని, రవిచావలి డైరెక్ట్ చేసిన సూపర్‌ స్కెచ్‌, మోహన్‌ లాల్‌, అల్లు శిరీష్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ డబ్బింగ్ సినిమా యుద్ధభూమి జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement