నేనే అమ్మాయి అయి ఉంటే: షారుక్
మార్చి8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో మహిళలకు అభినందల వెల్లువ కురిపించడం ఆనవాయితీ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడమూ మామూలే. కానీ బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ట్విట్టర్ లో మహిళలకు శుభాకాంక్షలు చెప్పిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. స్త్రీ శక్తిని కొనియాడుతూ, వారిని గౌరవిస్తూ.. ఆయన ట్వీట్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది. మహిళలకున్నంత ప్రేమ, త్యాగం తెగువ, శక్తిసామర్ధ్యాలు పురుషులకు ఉండవని చెబుతూ మహిళా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాడు.
తాను మహిళగా మారితే ఎలా ఉంటుంది అని ఆలోచించేవాడిననీ.. కానీ వారికున్న సాహసం, ప్రతిభ, త్యాగం, నిస్వార్థ ప్రేమ, అందం మనకు లేవని గుర్తించేవాడినని తెలిపాడు. అలాంటి లక్షణాలు మనకు అలవడలేదని, అవి అమ్మాయిలకు మాత్రమే సొంతం .. థ్యాంక్యూ గర్ల్స్ అంటూ ట్వీట్ చేశాడు బాలీవుడ్ సూపర్ స్టార్.
Often I wish I was a woman…then realise I don’t have enough guts, talent,sense of sacrifice, selfless love or beauty to be one. Thk u girls.
— Shah Rukh Khan (@iamsrk) March 8, 2016