
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌కు కొద్ది రోజులుగా కాలం కలిసి రావటం లేదు. షారూఖ్ ఓ సాలిడ్ హిట్ సాధించి చాలా కాలం అయ్యింది. ఎన్నో ఆశలతో స్వయంగా నటించి నిర్మించిన జీరో కూడా బోల్తా పడటంతో కింగ్ ఖాన్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే అంగీకరించిన రాకేష్ శర్మ బయోపిక్ సారే జహాసే అచ్చాను కూడా పక్కనపెట్టేశాడు.
ఈ పరిస్థితిల్లో షారూఖ్ ఓ తెలుగు దర్శకుడితో కలిసి పనిచేసేందుకు ఓకె చెప్పాడట. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ తెలుగులో అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో లాంటి సినిమాలను రూపొందించాడు. సక్సెస్ సాధించలేకపోయినా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రకాష్ బాలీవుడ్‌లో కంగనా, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో మెంటల్ హై క్యా సినిమాను రూపొందిస్తున్నాడు.
మానసిక వికలాంగుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ అతిథి పాత్రలో నటించనున్నాడట. కథకు కీలకం కావటంతో పాటు పవర్‌ఫుల్ రోల్ కావటంతో షారూఖ్ కూడా ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మెంటల్ హై క్యా టైటిల్‌పై పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. టైటిల్ మానసిక విగలాంగులను అవమానించినట్టుగా ఉందన్న వాదన వినిపిస్తోంది. మరి అసలే సక్సెస్ లేని పరిస్థితుల్లో ఇలాంటి వివాదాస్పద చిత్రంలో షారూఖ్ నటిస్తాడా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment