ఆ సినిమాకు కలెక్షన్ల వర్షం | Shahid-Alia's film set to cross the Rs 50-cr mark | Sakshi
Sakshi News home page

ఆ సినిమాకు కలెక్షన్ల వర్షం

Published Thu, Jun 23 2016 6:04 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

ఆ సినిమాకు  కలెక్షన్ల వర్షం

ఆ సినిమాకు కలెక్షన్ల వర్షం

ముంబై : సినిమాలో ఉన్న డ్రామా కంటే.. సినిమా విడుదలకు ముందే బోలెడంత డ్రామాకు తెర తీసిన బాలీవుడ్ మూవీ 'ఉడ్తా పంజాబ్'  కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఐదు రోజుల్లో రూ.42 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. విడుదలకు ముందు దర్శక,నిర్మాతలకు కష్టాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా.. ప్రస్తుతం వారి మీద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరో వీకెండ్ వస్తుండటంతో కలెక్షన్లు మరింత పెరగడం ఖాయం.

ముందే సినిమా ఆన్లైన్లో లీక్ అయినప్పటికీ ఆ ప్రభావం సినిమా కలెక్షన్ల మీద పడలేదు. కలెక్షన్లకు పోటీగా ప్రశంసలను కూడా సొంతం చేసుకుంటోంది 'ఉడ్తా పంజాబ్'. ఈ ఏడాది అత్యంత వివాదాస్పద చిత్రంగా వార్తల్లో నిలిచిన ఈ సినిమాలో పంజాబ్ను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ సమస్యను ఇతివృత్తంగా తీసుకున్నారు. షాహిద్ కపూర్, ఆలియా భట్ల నటనకు విమర్శకుల ప్రశంసలందుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement