'ఫ్యాన్' వర్సెస్ సూపర్ స్టార్ | shahrukh khan fan trailer talk | Sakshi
Sakshi News home page

'ఫ్యాన్' వర్సెస్ సూపర్ స్టార్

Published Tue, Mar 1 2016 10:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

'ఫ్యాన్' వర్సెస్ సూపర్ స్టార్

'ఫ్యాన్' వర్సెస్ సూపర్ స్టార్

తన లుక్తో ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసిన షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ఫ్యాన్, తొలి ట్రైలర్తో ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పటి వరకు కేవలం డ్రామాగా మాత్రమే ఈ సినిమాను చూపిస్తూ వచ్చిన చిత్రయూనిట్ ఫస్ట్ ట్రైలర్లో ఇదో యాక్షన్ డ్రామగా రివీల్ చేశారు. ముఖ్యం రెండు విభిన్న పాత్రల్లో షారూఖ్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు.

ట్రైలర్తోనే సినిమా కథను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. తన అభిమాన నటుడి కోసం ఎంతకైన తెగించే వ్యక్తి ఆ నటుడికే శత్రువుగా మరటం, ఆ తరువాత పరిణామాలే ఈ సినిమా కథగా కనిపిస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఫ్యాన్ సినిమాకు మనీష్ శర్మ దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 15న రిలీజ్ కు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement