'ప్రేక్షకుల అభిరుచి మారుతోంది'
'ప్రేక్షకుల అభిరుచి మారుతోంది'
Published Fri, Apr 15 2016 11:46 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM
భారతీయ సినీ ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. రోటిన్ పాటలు, ఫైట్లు ఉన్న సినిమాలకు ఇక కాలం చెల్లినట్లే అంటున్నాడు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్. తన లేటెస్ట్ ఎంటర్ టైనర్ 'ఫ్యాన్' రిలీజ్ సందర్భంగా లండన్లో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నఅతడు, ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ప్రయోగాత్మక చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. బయోగ్రఫికల్ మూవీస్, డిఫరెంట్ కాన్సెప్ట్లతో వస్తున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి.
ఫ్యాన్ కథ కూడా అదే తరహాలో రూపొందింది. ఒక సూపర్ స్టార్కు వీరాభిమాని అయిన ఓ యువకుడు, అనుకోని విధంగా ఆ హీరోకు శత్రువుగా మారితే ఏం జరిగింది అన్నదే ఫ్యాన్ కథ. షారూఖ్ ద్విపాత్రాభినం చేస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ ఆర్యన్ ఖన్నా, పాత్రతో పాటు అతని అభిమాని గౌరవ్ పాత్రలో నటించాడు. మనీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
Advertisement
Advertisement