'ఫ్యాన్ చనిపోయాడు.. అందుకే చేయను' | This Update From Shah Rukh Khan on Fan Will Break Your Heart | Sakshi
Sakshi News home page

'ఫ్యాన్ చనిపోయాడు.. అందుకే చేయను'

Published Wed, Apr 20 2016 4:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

'ఫ్యాన్ చనిపోయాడు.. అందుకే చేయను' - Sakshi

'ఫ్యాన్ చనిపోయాడు.. అందుకే చేయను'

ముంబయి: 'సినిమాలో ఫ్యాన్ చనిపోతాడు. అందుకే ఈ సినిమాకు కొనసాగింపు చిత్రం తీయాలని అనుకోవడం లేదు' అని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అన్నారు. ఫ్యాన్ కు సీక్వెల్ తీసే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అయితే, మరోసారి దర్శకుడు మనీశ్ శర్మతో పనిచేయాలని భావిస్తున్నానని, అయితే, అది కొత్త కథతో కూడుకొని ఉంటుందని అన్నారు. 'మనీశ్ నేను ఫ్యాన్ లాంటి చిత్రంకోసం కాకుండా మరోచిత్రానికి కలిసి పనిచేస్తాం. అది కచ్చితంగా వేరే సబ్జెక్టు అయి ఉంటుంది.

వచ్చే ఏడాదిలో దానిపై పనిచేస్తాం. అది మంచి చిత్రంగా మిగులుతుంది' అని షారుక్ చెప్పారు. 'నేను ఇప్పటికీ ఫీలవుతున్నాను. ఆర్యన్ అనే క్యారెక్టర్తో స్క్రీన్ పై నటించడం చాలా కష్టం. ఒక నటుడిగా స్టార్ గా అది నా జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర. సినిమా నటులు నటించే చిత్రాల్లో కాస్తంతా హుందాగా ఉండాలి. ఎందుకంటే నేను అలాంటి పాత్రల్లోనే చేస్తున్నాను కనుక' అని అన్నారు. ప్రస్తుతం ఫ్యాన్ నిరమాత ఆదిత్యా చోప్రా బేఫికర్ చిత్రం కోసం ప్యారిస్ వెళ్లారని, నేను లండన్ వెళుతున్నానని రాగానే ఫ్యాన్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement