హీరో ఇంట్లో స్నానం చేసిన అభిమాని! | Shahrukh Khan's Fan Dives Into His Swimming Pool, Takes A Bath | Sakshi
Sakshi News home page

హీరో ఇంట్లో స్నానం చేసిన అభిమాని!

Published Thu, Feb 18 2016 6:58 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

హీరో ఇంట్లో స్నానం చేసిన అభిమాని!

హీరో ఇంట్లో స్నానం చేసిన అభిమాని!

సినీ తారలంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ అభిమానుల్లో వీరాభిమానులు వేరు! అలాంటి ఓ వ్యక్తి..  తను అమితంగా ఆరాధించే హీరోగారు జలకాలాడే 'స్విమ్మింగ్ పూల్'లో ఒక్కసారైనా స్నానం చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా గుట్టుచప్పుడు కాకుండా పనికానిచ్చేశాడు. కానీ చివరలో సెక్యూరిటీకి దొరికిపోయాడు. దాంతో విషయం సదరు హీరోకి తెలిసి అతడికి తనపట్ల ఉన్న క్రేజ్కు అవాక్కయ్యి ఓ చిరునవ్వు నవ్వుకుని ఊరుకున్నాడు. ఆ క్రేజీ స్టారే బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్.

షారుఖ్ 'ఫ్యాన్' సినిమా ప్రమోషన్లో ఉండగా 'మీ అభిమానులకు సంబంధించి మీకు గుర్తున్న ఓ క్రేజీ సంఘటనను చెప్పండి' అని అడిగిన విలేకరులతో షారుఖ్  కొన్నాళ్ల క్రితం తను ఇంట్లో జరిగిన సంఘటనను పంచుకున్నారు. ఓ రోజు ఓ అభిమాని చాకచక్యంగా షారుఖ్ ఇంటి ఆవరణలోకి ప్రవేశించడమే కాకుండా.. ప్రశాంతంగా స్విమ్మింగ్ పూల్లో స్నానం కూడా కానిచ్చేశాడట. చివరలో సెక్యూరిటీ గార్డులు గుర్తించి అతన్ని పట్టుకుని నిలదీయగా.. 'షారుఖ్ స్నానం చేసే చోట ఒక్కసారైనా నేను కూడా స్నానం చేయాలనుకున్నాను, అందుకే ఇలా చేశాను' అని చెప్పాడట!

'ఇంకా నయం, ఇంతకుముందు నేను 'లక్స్' సోప్ యాడ్లో చుట్టూ హీరోయిన్ల మధ్య బాత్ టబ్లో కనబడినట్లు.. అతనికి కూడా అలానే చేయాలనే ఆలోచన కలగలేదు, అదే జరిగితే ఏమై ఉండేదో ఏమో' అంటూ చమత్కరించాడు కింగ్ ఖాన్.  యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న 'ఫ్యాన్' సినిమాలో  సినీతారగా, అభిమానిగా షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement