శనిదేవుని పాటలు | Shani Devudu audio launched | Sakshi
Sakshi News home page

శనిదేవుని పాటలు

Published Mon, Aug 25 2014 12:51 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

శనిదేవుని పాటలు - Sakshi

శనిదేవుని పాటలు

శనిదేవుని మహిమల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘శనిదేవుడు’. శివ జొన్నలగడ్డ శనిదేవుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమన్, ఆకాశ్ ప్రధాన పాత్రధారులు. అనిల్ నండూరి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శాసనసభ్యురాలు డీకే ఆరుణ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని ఆకాశ్‌కి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. డబ్బు సంపాదన కోసం ఈ సినిమా తాను చేయలేదనీ, శని ఎంత మంచి దేవుడో ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో ఈ సినిమా చేస్తున్నాననీ దర్శక, నిర్మాత తెలిపారు. గోపీనాథరెడ్డి, సారిపల్లి కొండలరావు, వైజాగ్ ప్రసాద్, బసిరెడ్డి, ప్రొ.సుబ్రమణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement