Shani Devudu
-
మకర సంక్రాంతి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి!
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అతి ముఖ్యమైన పండుగు, భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజులను విశేషంగా భావిస్తున్నారు. ఈ ఏడాది 2024 జనవరి 15 మకర సంక్రాంతి జరుపుకుంటున్నారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాలాన్ని సూర్య చంద్ర, నక్షత్రాల ఆధారంగా లెక్కిస్తారు.అలా సూర్య భగవానుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించిన పుణ్యసమయమే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి నాడు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రోజు చేసే దానం అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. సకల శుభాలు కలగాలంటే ఖచ్చితంగా ఈ బియ్యం, కిచిడీ, బెల్లం, నల్ల నువ్వులు, దుప్పట్లు దానం చేయాలని కూడా చెబుతారు. పితృదేవతలకు తర్పణం సంక్రాంతి రోజు సూర్యునికి అర్ఘ్యం, నైవేద్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చని పండితులు చెబుతారు. అలాగే సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రాలు దానం చేస్తే విశేష ఫలము లభిస్తుందలకేవలం మకర సంక్రాంతి రోజు పితృ దేవతలకు నువ్వులతో తర్పణాలు వదలుతారు కూడా. నూతన వస్త్రములను దానం చేయాలి. సత్యనారాయణ వ్రతం మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా విశేషం. సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రములు వంటివి దానము చేసినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలము లభిస్తుందని పండితులు మాట. ప్రత్యేకంగా నువ్వులు దానం,పూజ సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి శని దేవుడు నల్ల నువ్వులతో స్వాగతం పలుకుతాడని, దీనికి మెచ్చిన సూర్యుడు ఈ రోజు తనను నువ్వు పూజించిన వారికి సకల సంతోషాలు కలుగుతాయని దీవించాడని పురాణాలు చెబుతున్నాయి. దీంతో మరక సంక్రాంతి రోజు సూర్యుడికి పూజలు చేయడంతోపాటు, నల్లనువ్వులు కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించాలి. అలాగే శనికి ప్రీతికరమైన నల్లనువ్వులను ధారపోసినా, నదానమిచ్చినా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని, ఏలిన నాటి శని దోషాలు తొలగి జీవితంలో వెలుగులు ప్రసరిస్తాయట. ఈ రోజు నెయ్యి దానం చేయడం వల్ల అన్ని రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే జాతకంలో సూర్యుడు-గురు గ్రహ స్థానం బలపడుతుంది. సంక్రాంతి నాడు బెల్లం దానం చేస్తారు. అటుకులు బెల్లం కలిపి దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంకా ఈ రోజు మినపపప్పు, బియ్యంతో చేసిన ఖిచ్డీని దానం చేస్తారు. ఫలితంగ మనుషుల జాతకంలో సూర్యుడు, చంద్రుడు , బృహస్పతి స్థానం బలంగా ఉంటుందని చెబుతారు. -
బాధల నుంచి విముక్తి...
శనీశ్వరుడు బాధలకు గురిచేసే దైవం కాదు... బాధల నుంచి విముక్తిని కలిగించే దైవం అని తెలిపే కథాంశంతో రూపొందిన భక్తిరస చిత్రం ‘శనిదేవుడు’. సుమన్, ఆకాశ్, శివ జొన్నలగడ్డ ముఖ్యతారలుగా స్వీయ దర్శకత్వంలో జొన్నలగడ్డ శివ నిర్మించిన ఈ చిత్రం నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా జొన్నలగడ్డ శివ మాట్లాడుతూ- ‘‘తెలుగులో శనీశ్వరుని చరిత్ర నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇది. శనిదేవుని గొప్పతనమేంటో ఈ కథ తెలియజేస్తుంది’’ అని తెలిపారు. -
శనిదేవుని పాటలు
శనిదేవుని మహిమల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘శనిదేవుడు’. శివ జొన్నలగడ్డ శనిదేవుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమన్, ఆకాశ్ ప్రధాన పాత్రధారులు. అనిల్ నండూరి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శాసనసభ్యురాలు డీకే ఆరుణ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని ఆకాశ్‌కి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. డబ్బు సంపాదన కోసం ఈ సినిమా తాను చేయలేదనీ, శని ఎంత మంచి దేవుడో ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో ఈ సినిమా చేస్తున్నాననీ దర్శక, నిర్మాత తెలిపారు. గోపీనాథరెడ్డి, సారిపల్లి కొండలరావు, వైజాగ్ ప్రసాద్, బసిరెడ్డి, ప్రొ.సుబ్రమణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
శని దేవుడు మూవీ స్టిల్స్
-
శనిదేవుని మహిమలు
‘శనిదేవుడు మంచివాడు.. చెడ్డవాడుకాదు’ అనే నినాదంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘శనిదేవుడు’. ‘మహిమలు చూడండి’ అనేది ఉపశీర్షిక. శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఉగాదికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శివ మాట్లాడుతూ- ‘‘మనిషి ఆయుష్షు 120 ఏళ్లు అనుకుంటే... అందులో 19ఏళ్లు శనిదశ నడుస్తుంది. ఆ 19 ఏళ్లు.. కష్టాల విలువ, జీవితం గొప్పదనం, బాధ్యతలు, బంధాల విలువల్ని కూడా తెలియజేస్తాయి. శనిదశ ముగింపుకి చేరుకున్నప్పుడు ఆయన మంచి చేసే తప్పుకుంటాడు. సూర్యుణ్ణి ప్రత్యక్ష నారాయణునిగా కొలిచే మనం ఆయన కుమారుడు శనిని ఎందుకు నిందిస్తాం? ఈ విషయంపై పరిశోధన జరిపి, పలువురు పండితుల అభిప్రాయాలను తీసుకొని శని గొప్ప దేవుడు అని చెప్పడమే పరమావధిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అని తెలిపారు. అహంకారమే ఆభరణంగా చేసుకున్న మహారాజు పాత్రను చేస్తున్నానని సుమన్ చెప్పారు. ఇందులో ఓ ముఖ్యమైన పాట చేశానని ఆకాష్ తెలిపారు. -
శనిదేవుణ్ణి స్తుతించిన ఎస్పీబాలు
శనీశ్వరుని మహిమల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘శనిదేవుడు’. ‘మహిమలు చూడండి’ అనేది ఉపశీర్షిక. జ్యోతిష పండితులు శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే పలు శనీశ్వరాలయాల్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అనిల్ నండూరి స్వర సారథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించడం విశేషం. కులమత రహితంగా అందరూ చూడదగ్గ సినిమా ఇదని శివ జొన్నలగడ్డ చెప్పారు. నరసింహరాజు, తెలంగాణ శకుంతల, రంగనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్, నిర్మాణం: సోని ఫిలింస్.