హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అతి ముఖ్యమైన పండుగు, భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజులను విశేషంగా భావిస్తున్నారు. ఈ ఏడాది 2024 జనవరి 15 మకర సంక్రాంతి జరుపుకుంటున్నారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాలాన్ని సూర్య చంద్ర, నక్షత్రాల ఆధారంగా లెక్కిస్తారు.అలా సూర్య భగవానుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించిన పుణ్యసమయమే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి నాడు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రోజు చేసే దానం అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. సకల శుభాలు కలగాలంటే ఖచ్చితంగా ఈ బియ్యం, కిచిడీ, బెల్లం, నల్ల నువ్వులు, దుప్పట్లు దానం చేయాలని కూడా చెబుతారు.
పితృదేవతలకు తర్పణం
సంక్రాంతి రోజు సూర్యునికి అర్ఘ్యం, నైవేద్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చని పండితులు చెబుతారు. అలాగే సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రాలు దానం చేస్తే విశేష ఫలము లభిస్తుందలకేవలం మకర సంక్రాంతి రోజు పితృ దేవతలకు నువ్వులతో తర్పణాలు వదలుతారు కూడా. నూతన వస్త్రములను దానం చేయాలి.
సత్యనారాయణ వ్రతం
మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా విశేషం. సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రములు వంటివి దానము చేసినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలము లభిస్తుందని పండితులు మాట.
ప్రత్యేకంగా నువ్వులు దానం,పూజ
సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి శని దేవుడు నల్ల నువ్వులతో స్వాగతం పలుకుతాడని, దీనికి మెచ్చిన సూర్యుడు ఈ రోజు తనను నువ్వు పూజించిన వారికి సకల సంతోషాలు కలుగుతాయని దీవించాడని పురాణాలు చెబుతున్నాయి. దీంతో మరక సంక్రాంతి రోజు సూర్యుడికి పూజలు చేయడంతోపాటు, నల్లనువ్వులు కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించాలి. అలాగే శనికి ప్రీతికరమైన నల్లనువ్వులను ధారపోసినా, నదానమిచ్చినా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని, ఏలిన నాటి శని దోషాలు తొలగి జీవితంలో వెలుగులు ప్రసరిస్తాయట.
ఈ రోజు నెయ్యి దానం చేయడం వల్ల అన్ని రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే జాతకంలో సూర్యుడు-గురు గ్రహ స్థానం బలపడుతుంది. సంక్రాంతి నాడు బెల్లం దానం చేస్తారు. అటుకులు బెల్లం కలిపి దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంకా ఈ రోజు మినపపప్పు, బియ్యంతో చేసిన ఖిచ్డీని దానం చేస్తారు. ఫలితంగ మనుషుల జాతకంలో సూర్యుడు, చంద్రుడు , బృహస్పతి స్థానం బలంగా ఉంటుందని చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment