మందు, ముక్కతో కనుమ మజా | - | Sakshi
Sakshi News home page

మందు, ముక్కతో కనుమ మజా

Published Wed, Jan 17 2024 1:12 AM | Last Updated on Wed, Jan 17 2024 8:47 AM

పూర్ణామార్కెట్‌లో నాటుకోళ్లు, మటన్‌ కొనుగోలు చేస్తున్న ప్రజలు - Sakshi

పూర్ణామార్కెట్‌లో నాటుకోళ్లు, మటన్‌ కొనుగోలు చేస్తున్న ప్రజలు

జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది. తెలుగు వారి ముఖ్యమైన పండగల్లో ఒకటైన సంక్రాంతి ఇంటింటా కొత్తకాంతులు తెచ్చింది. కొత్త అల్లుళ్లు, బంధువుల రాక, పిండి వంటల ఘుమఘుమలతో ప్రతి ఇల్లూ సందడిగా మారిండి. సంక్రాంతి మూడు రోజులూ ప్రజలు పెద్ద పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు. నగరంలో స్థిరపడ్డ పలువురు సొంతూళ్లకు చేరుకుని.. అయిన వారి మధ్య వేడుకగా పండగను జరుపుకున్నారు.

సింథియా: ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయంలో చీఫ్‌ ఆఫ్‌ స్టాప్‌ (ఆపరేషన్స్‌)గా రియర్‌ అడ్మిరల్‌ శంతను ఝా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన శంతను ఝూ తన కెరీర్‌లో ఆరు ఫ్రంట్‌లైన్‌ ఫ్రిగేట్స్‌, డిస్ట్రాయర్స్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను నావిగేట్‌ చేసి నావిగేషన్‌ అండ్‌ స్పెష్టలిస్ట్‌గా అనుభవాన్ని సంపాదించారు. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, భారతీయ నౌకాదళ నౌకలు నిశాంక్‌, కోరా, సహ్యాద్రిలలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా విజయవంతమైన కమాండ్‌లు చేశారు. ఆయన మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి డిఫెన్స్‌ స్టడీస్‌, లండన్‌లోని ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ అండ్‌ స్ట్రాటజీ కింగ్స్‌ కాలేజీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీని పొందారు.

సాక్షి, విశాఖపట్నం: కనుమ పండగను విశాఖ వాసులు మజా చేశారు. మందు, ముక్కలతో బాగా ఎంజాయ్‌ చేశారు. భోగి, సంక్రాంతి రెండు రోజులు మాంసాహారాన్ని ముట్టరు. ఆ తర్వాత రోజున వచ్చే కనుమకు మాంసాహార ప్రియులు నాన్‌వెజ్‌ను ఆరగించడం రివాజుగా భావిస్తారు. ఇక మందుబాబులు మామూలు రోజులకంటే కనుమ నాడు మరింతగా మద్యాన్ని సేవిస్తారు. అందుకే అలాంటి కనుమ పండుగ ఎప్పుడు వస్తుందా? అంటూ కళ్లప్పగించి ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది కనుమను జనం ఘనంగానే జరుపుకున్నారు. ఉదయం నుంచి మాంసం, మద్యం కొనుగోళ్లపైనే దృష్టి సారించారు. తెల్లారేసరికే మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. కొందరు తెలివిగా సంక్రాంతికి ముందే మందుబాటిళ్లను కొనుగోలు చేసి జాగ్రత్త పడ్డారు. మద్యం ప్రియులు మరికొంతమంది స్నేహితులతో కలిసి మందు, ముక్కలతో మునిగి తేలారు. కొందరు ఇళ్లకు దూరంగా వెళ్లి పార్టీలు చేసుకున్నారు.

ఇక కనుమ అంటే మద్యంతో పాటు మాంసం విక్రయాలదే అగ్రస్థానం. సాధారణ రోజుల్లోకంటే కనుమ పండుగ రోజున వీటి అమ్మకాలు రెండు రెట్లకు పైగానే జరుగుతాయి. బ్రాయిలర్‌ చికెన్‌కంటే నాటు కోడి మాంసం రుచిగా ఉంటుందన్న భావనతో కాస్త స్థోమత ఉన్న వారు దీన్ని కొనుగోలు చేస్తుంటారు. మంగళవారం విశాఖలో బ్రాయిలర్‌ చికెన్‌కంటే నాటు (దేశవాళీ) కోడి మాంసం మూడున్నర రెట్లు అధికంగా పలికింది. బ్రాయిలర్‌ చికెన్‌ కిలో రూ.230 ఉంటే నాటు కోడి మాంసం రూ.800కు విక్రయించారు. మూడు రోజుల కిందట కిలో నాటు కోడి మాంసం రూ.600– 650 ఉండగా మంగళవారం అది రూ.800కి పెంచారు.

కిలో రూ.190 ఉండే బ్రాయిలర్‌ చికెన్‌ రూ.40 పెరిగి రూ.230కి పెరిగింది. ఇక మటన్‌ కిలో రూ.800 నుంచి 900కి ఎగబాకింది. ఇలా వీటన్నిటిపై కిలోకు రూ.100–150 వరకు పెరిగినా తగ్గేదే లే అంటూ కొనుగోళ్లు చేశారు. విశాఖలో కనుమ నాడు 1,500కు పైగా దుకాణాల ద్వారా సుమారు ఐదు లక్షల కిలోల బ్రాయిలర్‌ చికెన్‌, 50 వేల కిలోల నాటు కోడి మాంసం, మరో 50 వేల కిలోల మటన్‌ అమ్ముడైందని మార్కెట్‌ వర్గాల అంచనా. మొత్తం మీద కనుమ పండుగ సందర్భంగా విశాఖలో రూ.11 కోట్ల బ్రాయిలర్‌ చికెన్‌, రూ.4 కోట్ల నాటు కోడి మాంసం, మరో రూ.4.5 కోట్ల విలువైన మటన్‌ అమ్మకాలు జరిగాయని అనధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది.

సినిమాలు.. షికార్లు..
మందుబాబులు, మాంసాహారులు కనుమను తమదైన రీతిలో ఎంజాయ్‌ చేయగా ఇతరులు సినిమాలు, షికార్లకు ప్రాధాన్యమిచ్చారు. ప్రేక్షకులతో నగరంలోని సినిమా హాళ్లు కిక్కిరిసి కనిపించాయి. పలువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పర్యాటక ప్రదేశాలకు, సాగరతీరంలోని బీచ్‌లకు వెళ్లి చాలాసేపు అక్కడే ఆనందంగా గడిపారు. ఎదురుగా ఎగసి పడుతున్న కెరటాలతో సయ్యాటలాడుతూ పిల్లాపాపలతో కేరింతలు కొట్టారు. భారీగా పోటెత్తిన సందర్శకులతో బీచ్‌లన్నీ కళకళలాడాయి. ఇంకొందరు సాగరతీరంలో పతంగులను ఎగురవేసి సంబరపడ్డారు. ఇలా కనుమ పండుగను నగరవాసులు తనివి తీరా ఆస్వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement