danam
-
మకర సంక్రాంతి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి!
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అతి ముఖ్యమైన పండుగు, భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజులను విశేషంగా భావిస్తున్నారు. ఈ ఏడాది 2024 జనవరి 15 మకర సంక్రాంతి జరుపుకుంటున్నారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాలాన్ని సూర్య చంద్ర, నక్షత్రాల ఆధారంగా లెక్కిస్తారు.అలా సూర్య భగవానుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించిన పుణ్యసమయమే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి నాడు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రోజు చేసే దానం అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. సకల శుభాలు కలగాలంటే ఖచ్చితంగా ఈ బియ్యం, కిచిడీ, బెల్లం, నల్ల నువ్వులు, దుప్పట్లు దానం చేయాలని కూడా చెబుతారు. పితృదేవతలకు తర్పణం సంక్రాంతి రోజు సూర్యునికి అర్ఘ్యం, నైవేద్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చని పండితులు చెబుతారు. అలాగే సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రాలు దానం చేస్తే విశేష ఫలము లభిస్తుందలకేవలం మకర సంక్రాంతి రోజు పితృ దేవతలకు నువ్వులతో తర్పణాలు వదలుతారు కూడా. నూతన వస్త్రములను దానం చేయాలి. సత్యనారాయణ వ్రతం మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా విశేషం. సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రములు వంటివి దానము చేసినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలము లభిస్తుందని పండితులు మాట. ప్రత్యేకంగా నువ్వులు దానం,పూజ సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి శని దేవుడు నల్ల నువ్వులతో స్వాగతం పలుకుతాడని, దీనికి మెచ్చిన సూర్యుడు ఈ రోజు తనను నువ్వు పూజించిన వారికి సకల సంతోషాలు కలుగుతాయని దీవించాడని పురాణాలు చెబుతున్నాయి. దీంతో మరక సంక్రాంతి రోజు సూర్యుడికి పూజలు చేయడంతోపాటు, నల్లనువ్వులు కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించాలి. అలాగే శనికి ప్రీతికరమైన నల్లనువ్వులను ధారపోసినా, నదానమిచ్చినా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని, ఏలిన నాటి శని దోషాలు తొలగి జీవితంలో వెలుగులు ప్రసరిస్తాయట. ఈ రోజు నెయ్యి దానం చేయడం వల్ల అన్ని రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే జాతకంలో సూర్యుడు-గురు గ్రహ స్థానం బలపడుతుంది. సంక్రాంతి నాడు బెల్లం దానం చేస్తారు. అటుకులు బెల్లం కలిపి దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంకా ఈ రోజు మినపపప్పు, బియ్యంతో చేసిన ఖిచ్డీని దానం చేస్తారు. ఫలితంగ మనుషుల జాతకంలో సూర్యుడు, చంద్రుడు , బృహస్పతి స్థానం బలంగా ఉంటుందని చెబుతారు. -
సీబీఐ వలలో పీఎఫ్ కార్యాలయ ఉద్యోగి
కడప అర్బన్ : కడప పీఎఫ్ (భవిష్య నిధి) కార్యాలయం ఉద్యోగి దానంను సోమవారం లంచం తీసుకుంటుండగా గుంటూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పీఎఫ్‌కు సంబంధించి రుణాలను మంజూరు చేసేందుకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులను కడపలోని రీజనల్ పీఎఫ్ కార్యాలయంలో లోయర్ డివిజన్ క్లర్క్‌గా పనిచేస్తున్న ఎస్. దానం కొంత మొత్తాన్ని లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు సోమవారం సాయంత్రం కార్యాలయం సమీపంలోని ఎల్ఐసీ క్వార్టర్స్ వెనుక వైపునకు దానంను రమ్మన్నారు. అక్కడకు వచ్చిన దానంకు రూ. 9 వేలు లంచంగా ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ డబ్బుతో పాటు మూడు క్వార్టర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని పెద్దమనుషుల సమక్షంలో పంచనామా రాసుకుని మంగళవారం ఉదయం తమ వెంట గుంటూరుకు తీసుకుని వెళ్లారు. ఈ సంఘటన కడపలో మంగళవారం గుప్పుమంది. పీఎఫ్ కార్యాలయంలో కలకలం రేపింది. పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ బాలకృష్ణజీ తమ కార్యాలయం అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అన్నివిభాగాల్లోని అధికారులను వ్యక్తిగతంగా పిలిచి విధుల పట్ల నిక్కచ్చిగా వ్యవహరించాలనీ, అవినీతికి పాల్పడితే వారే బాధ్యులవుతారనీ ఆయన హెచ్చరించారు. సంఘటనపై ఆర్సీ వివరణ కడపలోని పీఎఫ్ ప్రాంతీయ ఉప కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగి ఎస్.దానంను సీబీఐ అధికారులు పట్టుకున్న మాట వాస్తవమేనని, తమకు ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని రీజనల్ కమిషనర్ బాలకృష్ణజీ మీడియాకు ఫోన్లో సమాచారం తెలిపారు. -
లంచం తీసుకుంటూ సీబీఐకీ చిక్కిన ఎల్డీసీ
కడప : కడపలోని పీఎఫ్ కార్యాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. వివరాలు ఇలా ఉన్నాయి... నెల్లూరు జిల్లా కావాలి మున్సిపాలిటీలో కార్మికులుగా పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు భవిష్యనిధి నుంచి రుణం తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ క్రమంలో రుణం మంజూరు చేయాలంటే రూ. 9 వేలు లంచం కింద ఇవ్వాలని పీఎఫ్ కార్యాలయంలో ఎల్డీసీ దానం డిమాండ్ చేశారు. దీంతో సదరు కార్మికులు సీబీఐ అధికారులను ఆశ్రయించారు. సీబీఐ అధికారులు వలపన్ని మంగళవారం ఉదయం పీఎఫ్ కార్యాలయంలో రూ. 9 వేలు లంచం తీసుకుంటుండగా దానంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం దానంను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు అధికారులు తరలిస్తున్నారు. -
'తక్షణం అసెంబ్లీ, కౌన్సిల్‌ను సమావేశపర్చండి'
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల శంకుస్థాపన పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని దీనిని హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. హైదరాబాద్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి, దానం మాట్లాడారు. తెలంగాణలో కరవుపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీ, కౌన్సిల్‌ను సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం ఢిల్లీ టూర్ రాష్ట్రప్రయోజనాల కోసం కాకుండా సొంత అజెండాలా మారిందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల శంకుస్థాపనలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. సీఎం, సంబంధిత మంత్రులు కాకుండా మంత్రి కేటీఆర్ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తారని.. దీనిపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతుందనడానికి ఇదే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. గ్రేటర్లో ఓట్ల కోసమే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరగడం లేదని నాయకులు చెప్పారు. -
వైఎస్సాఆర్‌కు నివాళందించిన కాంగ్రెస్ నేతలు
-
మేము ఏం చేయాలి?...చీపుర్లు పట్టుకోవాలా?
-
హైదరాబాద్‌ను యూటీ చేస్తే అగ్నిగుండమే