లంచం తీసుకుంటూ సీబీఐకీ చిక్కిన ఎల్డీసీ | LDC arrest in cbi officers in kadapa due to bribery | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ సీబీఐకీ చిక్కిన ఎల్డీసీ

Published Tue, Jul 26 2016 12:02 PM | Last Updated on Tue, Oct 30 2018 7:25 PM

LDC arrest in cbi officers in kadapa due to bribery

కడప : కడపలోని పీఎఫ్ కార్యాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికాడు. వివరాలు ఇలా ఉన్నాయి... నెల్లూరు జిల్లా కావాలి మున్సిపాలిటీలో కార్మికులుగా పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు భవిష్యనిధి నుంచి రుణం తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

ఆ క్రమంలో రుణం మంజూరు చేయాలంటే రూ. 9 వేలు లంచం కింద ఇవ్వాలని పీఎఫ్ కార్యాలయంలో ఎల్డీసీ దానం డిమాండ్ చేశారు. దీంతో సదరు కార్మికులు సీబీఐ అధికారులను ఆశ్రయించారు. సీబీఐ అధికారులు వలపన్ని మంగళవారం ఉదయం పీఎఫ్ కార్యాలయంలో రూ. 9 వేలు లంచం తీసుకుంటుండగా దానంను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం దానంను హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు అధికారులు తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement