'షరాన్ స్టోన్ చాలా అందగత్తె' | Sharon Stone is beautiful, says abbie Cornish | Sakshi
Sakshi News home page

'షరాన్ స్టోన్ చాలా అందగత్తె'

Published Wed, Jan 29 2014 11:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

'షరాన్ స్టోన్ చాలా అందగత్తె'

'షరాన్ స్టోన్ చాలా అందగత్తె'

ఎప్పుడో.. 90లలో వచ్చిన 'బేసిక్ ఇన్స్టింక్ట్' సినిమా చూశారా? అందులో నటించిన షరాన్ స్టోన్ చాలా అందగత్తె అని మరో హాలీవుడ్ నటి అబీ కార్నిష్ చెబుతోంది. ఇటీవలే ఆమెను షరాన్ స్టోన్తో పత్రికలు పోల్చాయి. వీరిద్దరికీ మధ్య చాలా పోలికలు ఉన్నాయని చెప్పాయి. అయితే.. తనకంటే షరాన్ స్టోన్ చాలా అందగత్తె అని, ఆమెతో తనకు పోలిక లేదని కార్నిష్ అంటోంది.

షరాన్తో పోల్చినందుకు ఎలా అనిపిస్తోందని అడగ్గా, ''దాని గురించి నేనేం అనుకుంటాను? నాకు తెలీదు. నికలో్ కిడ్మన్ గురించి అంటారా.. కొంత వరకు పోల్పచుకోవచ్చు. కానీ షరాన్తో పోలిక అంటే నిజంగా నాకు తెలీదు. అయినా, షరాన్ స్టోన్ చాలా అందగత్తె కాబట్టి, ఆమెతో పోల్చారంటే అది నాకు పెద్ద కాంప్లిమెంటే'' అని తెలిపింది. 31 ఏళ్ల అబీ కార్నిష్ ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ సినిమా 'రోబోకాప్'లో క్లారా మర్ఫీ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా భారతదేశంలో వేలెంటైన్స్ డే రోజు అయిన ఫిబ్రవరి 14న విడుదల అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement