శర్వానంద్, కల్యాణీ ప్రియదర్శన్
నచ్చిన అమ్మాయి ఓర చూపు విసిరితే.. గాలికి తిరిగేవాడైనా గన్స్ చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్ అయినా ఒకటే. గాల్లో తేలిపోవడమే. అదే కన్ను కొట్టి చూస్తే? ఇంకా రాకెట్‌లో ఆకాశాన్ని అంటేస్తారు. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ అయిన శర్వా కూడా గాయకుడిగా మారిపోయి ‘కన్ను కొట్టి చూసేనంట సుందరి...’ అంటూ పాడుకున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లు. కామన్ మ్యాన్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో రెండోపాట ‘‘కన్ను కొట్టి చూసెనంట సుందరి... మనసు మీటి వెళ్లెనంట మనోహరి..’ను రిలీజ్ చేశారు. కృష్ణచైతన్య రచించిన ఈ పాటను సంగీత దర్శకుడు కార్తీక్ రాడ్రిగ్రూజ్ ఆలపించారు. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని పీడీవి ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment