శిల్పాషిండే
భారత్‌లో #మీటూ ఉద్యమం అర్థం లేనిదంటూ టెలివిజన్ స్టార్, బిగ్‌బాస్ విన్నర్ శిల్పాషిండే వ్యాఖ్యానించారు. ప్రజలకు వినోదాన్ని అందించే టీవీ, సినీ పరిశ్రమల్లో రేప్‌లు వంటి ఉదంతాలు ఉండవని కొట్టిపారేశారు. పరస్పర అవగాహనతోనే ఇద్దరి వ్యక్తుల మధ్య రిలేషన్ ఏర్పడుతుందనీ, దానికి అత్యాచారం అని పేరు పెట్టడం సరికాదని అన్నారు. ‘ప్రమాదం జరిగినప్పుడే స్పందించాలి, ప్రపంచం దృష్టికి తీసుకురావాలి. కానీ, ఘటన జరిగిన చాన్నాళ్లకు ఆ విషయం గురించి మాట్లాడితే అది వివాదమే అవుతుంది’ అని శిల్పా అన్నారు. ‘నిజమే.. మనకు ఎదురైన వేధింపులపై గొంతెత్తి ప్రపంచం దృష్టికి తేవాలంటే చాలా ధైర్యం కావాలి’ అని చెప్పారు. (హౌజ్‌ఫుల్ 4 నుంచి నానా ఔట్..!)
‘సినిమా, టీవీ పరిశ్రమలు చెడ్డవేం కాదు. అలాగని చాలా మంచివీ కాదు. కానీ, కొందరు కావాలని ఇండస్ట్రీ పేరును చెడగొట్టాలని చూస్తున్నారు. అంటే #మీటూలో వచ్చిన ఆరోపణలతో ఇండస్ట్రీలో పనిచేసేవారంతా తప్పు చేసినట్టేనా’ అని ప్రశ్నించారు. ఇక్కడెవరూ ఎవర్నీ బలవంతం చేయరని అన్నారు. పని ప్రదేశంలో అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని చెప్పుకొచ్చారు. (#మీటూ: సలోని సంచలన ఆరోపణలు)
కాగా, తనుశ్రీ దత్తా నుంచి పలువురు టెక్నీషియన్ల వరకు బాలీవుడ్ సెలెబ్రిటీలపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో భారత్‌లో #మీటూ ఉద్యమం మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది మహిళలు తమకు ఎదురైన వేధింపులపై సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు. బాలీవుడ్ దర్శకులు సుభాస్ ఘాయ్, సాజిద్ ఖాన్, వికాస్ బాహల్, రజత్‌కపూర్, నటులు అలోక్‌నాథ్, గాయకుడు కైలాష్‌ఖేర్ వంటి వారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
(చదవండి : మీటూ : ఆ జెంటిల్‌మ్యాన్ ముందుకు వచ్చి మాట్లాడాలి)
Comments
Please login to add a commentAdd a comment