ఇద్దరు హీరోయిన్లతో బాలయ్య.. ఒకరు ఫిక్స్‌? | Shriya Saran To Act In Balakrishna Boyapati New Telugu Movie | Sakshi
Sakshi News home page

ఇద్దరు హీరోయిన్లతో బాలయ్య.. ఒకరు ఫిక్స్‌?

Published Wed, Feb 19 2020 12:23 PM | Last Updated on Wed, Feb 19 2020 12:23 PM

Shriya Saran To Act In Balakrishna Boyapati New Telugu Movie - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం కాగా.. ఈ నెల చివరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. తొలి షెడ్యూల్‌ వారణాసిలో ప్లాన్‌ చేశారట చిత్ర బృందం. బాలయ్య-బోయపాటిల సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పట్నుంచి ఈ చిత్రం గురించి అనేక వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్‌ రోల్‌ పోషిస్తున్నాడని, అందులో ఒక పాత్ర అఘోరా అని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారని సమాచారం. 

ఆ ఇద్దరు కథానాయికలు ఎవరనేదానిపై చిత్రబృందం అనేక చర్చలు జరిపి చివరికి ఒకరిని ఫిక్స్‌ చేశారట. ఇప్పటికే బాలయ్యతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రల్లో కథానాయికగా నటించిన శ్రియను ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఫిక్స్‌ చేసినట్టు సమాచారం. మరో హీరోయిన్‌ ఎవరనేదానిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వలేదు. మరో హీరోయిన్‌ కోసం క్యాథరీన్‌, తమన్నాలను సంప్రదించగా వారు సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే సినిమా సెట్స్‌పైకి వెళ్లేలోపు ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌ వంటే మాస్‌ ఆడియన్స్‌కు పండగే. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం బాలయ్య, బోయపాటిలు ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమాతో ఒకేసారి ఇద్దరూ హిట్‌ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నారు.  


చదవండి:
బాలయ్య న్యూలుక్‌ అదిరింది!!
‘రూలర్‌’ మూవీ రివ్యూ​​​​​​​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement