ఎంత పని చేస్తే... అంత ఉత్సాహం | Shruti Haasan: My dad is very happy that I am working in Welcome Back! | Sakshi
Sakshi News home page

ఎంత పని చేస్తే... అంత ఉత్సాహం

Published Sat, Oct 11 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

ఎంత పని చేస్తే... అంత ఉత్సాహం

ఎంత పని చేస్తే... అంత ఉత్సాహం

 ‘‘అలుపా.. అలాంటిది నా నిఘంటువులోనే లేదు. నెలల తరబడి బిజీగా షూటింగ్స్ చేస్తున్నాం కాబట్టి, ఓ వారం రోజులు విశ్రాంతి తీసుకోరాదూ అని ఎవరైనా సలహా ఇస్తే, నవ్వేసి ఊరుకుంటా. ఎందుకంటే నూతనోత్సాహం కోసం నాకు సెలవులు అవసరంలేదు. పని చేసుకుంటూ పోతే ఉత్సాహం ఉరకలేస్తుంది’’ అని శ్రుతీహాసన్ చెప్పారు. ఆమె అలా అనడానికి కారణం కూడా ఉంది. ‘పూజ’ చిత్రంలో ఓ పాట షూటింగ్ కోసం ఇటీవల ఆమె స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కి వెళ్లారు. ఆ పాట చిత్రీకరణ పూర్తి కాగానే, వేరే చిత్రం షూటింగ్ కోసం వెంటనే దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. హడావిడిగా సూట్‌కేస్ సర్దుకుని ఫ్లయిట్ ఎక్కేశారు.
 
 అలా వెంట వెంటనే ప్రయాణాలు చేయడం కొంచెం ఒత్తిడి అనిపించినప్పటికీ, ఖాతరు చేయలేదని శ్రుతీ తెలిపారు. చేతినిండా పని ఉన్నప్పుడు చేయకపోతే భవిష్యత్తులో చింతించాల్సి వస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రుతీ నటిస్తున్న చిత్రాల్లో హిందీ చిత్రం ‘వెల్‌కమ్ బ్యాక్’ ఒకటి. ఇందులో సీనియర్ నటుడు నానా పటేకర్, అనిల్‌కపూర్‌లకు రాఖీ సిస్టర్‌గా నటిస్తున్నారు శ్రుతి. ఇంకా ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, డింపుల్ కపాడియా వంటి ప్రముఖులు కూడా నటిస్తున్నారు. అందుకని ‘వెల్‌కమ్ బ్యాక్’లోశ్రుతి నటించడం ఆమె తండ్రి కమల్‌హాసన్‌కు ఆనందాన్నిచ్చిందట. ఈ సీనియర్లతో నటించడం గురించి శ్రుతి చెబుతూ.. ఆ నలుగురూ సింప్లీ సూపర్బ్, చాలా డౌన్ టు ఎర్త్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement