నేనిప్పుడు బాగానే ఉన్నా | Shruti haasan tweets she is doing much better now | Sakshi
Sakshi News home page

నేనిప్పుడు బాగానే ఉన్నా

Published Wed, Nov 20 2013 12:09 PM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

నేనిప్పుడు బాగానే ఉన్నా

నేనిప్పుడు బాగానే ఉన్నా

దుండగుడు దాడిచేసిన ఘటన నుంచి శ్రుతి హాసన్ కోలుకుంటోంది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, ప్రస్తుతం అంతా బాగానే ఉందని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు, సినీరంగ ప్రముఖులకు చెబుతోంది. ఇప్పుడంతా చాలా బాగుందని, విషయం తెలుసుకుని తనను పరామర్శించినందుకు కృతజ్ఞతలు అని కూడా తన ట్విట్టర్ పేజీలో రాసింది. దాడి విషయం తెలియగానే పలువురు శ్రుతి ట్విట్టర్లో ఆమె గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ పలు ట్వీట్లు పోస్టుచేశారు. దీంతో దాదాపుగా రాత్రి పన్నెండు గంటల నుంచి అందరికీ సమాధానాలు ఇస్తూ వచ్చింది.

మంగళవారం ఉదయం 9.30 గంటలకు గుర్తుతెలియని దుండగుడు ఒకడు శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యాడు. శ్రుతి సన్నిహిత వర్గాల ప్రకారం.. ముంబై బాంద్రా ప్రాంతంలోని ఓ భవంతి ఆరో అంతస్తులో ఉన్న శ్రుతి ఇంటికి ఉదయం 9.30కు వచ్చిన దుండగుడు తొలుత కాలింగ్‌బెల్ మోగించాడు. శ్రుతి తలుపు తీసింది. ‘నువ్వు నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు?’ అని దుండగుడు ఆమెను ప్రశ్నించాడు. దీనికి శ్రుతి ‘నువ్వెవరో నాకు తెలియదు’ అని బదులిచ్చింది. దీంతో ఆగంతకుడు ఆమె గొంతుపట్టుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. శ్రుతి వెంటనే అతన్ని వెనక్కి తోసి తలుపు మూసింది. తర్వాత అతడు పారిపోయాడు. దాడి చేసిన దుండగుడు శ్రుతి నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె వెంట పడుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement