రెండు మనసులతో ఆడుకున్నా! | Sidharth Malhotra, Alia Bhatt Are The New 'Cola' Couple! | Sakshi
Sakshi News home page

రెండు మనసులతో ఆడుకున్నా!

Published Sat, Feb 21 2015 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

రెండు మనసులతో ఆడుకున్నా!

రెండు మనసులతో ఆడుకున్నా!

ఆలియా భట్‌ను చూసినవాళ్లు ‘ఆహా అద్భుత సౌందర్య రాశి’ అనుకోకుండా ఉండలేరు. కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఈ సుందరి ఒకప్పుడు తన మనసును ఇద్దరు అబ్బాయిలకు ఇచ్చేశారట. కళాశాలలో చదువుకున్నప్పుడు ఓ కుర్రాడితో ప్రేమలో పడ్డ ఆలియా, అతణ్ణే పెళ్లి చేసుకోవాలను కున్నారట. కానీ, ఏవో మనస్పర్థలు వచ్చి విడిపోయానని పేర్కొన్నారామె. ఆ తర్వాత ఓ కుర్రాణ్ణి ప్రేమించారు. అయితే, అతడి నుంచి కూడా విడిపోయారు.

ఆ ఇద్దరితో ప్రేమ గురించి ఆలియా చెబుతూ - ‘‘నా జీవితంలో ఇప్పటివరకూ నేను ప్రేమించింది ఆ ఇద్దర్నే. ఏదో విషయాల్లో మనస్పర్థలు వచ్చి, నేనే వదిలేశాను. వాళ్ల మనసులతో ఆడుకున్నా. ఆ విషయం నాకు తెలుసు. కర్మఫలం అంటారు కదా.. అలా ఎవరో ఒకరు నా మనసుతో కూడా ఆడుకుంటారనిపిస్తోంది. కానీ, అది జరగకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే, ఆ బ్రేకప్‌ను తట్టుకునేంత మానసిక స్థైర్యం నాకు లేదు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement