
సాక్షి, చెన్నై : కోలీవుడ్ యంగ్ హీరోల్లో శింబుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మల్టీ టాలెంటెడ్ అయిన శింబు ఓ మంచి సింగర్ కూడా. సినిమాలకే కాదు.. ప్రైవేట్‌గా కూడా ఆయన పాటలు పాడుతుంటారు. గతంలో మహిళలను కించపరుస్తూ ఆయన పాడిన బీప్ సాంగ్ పెను దుమారమే లేపింది. ఇదిలా ప్రస్తుతం ఆయన నోట్ల రద్దుకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఓ పాట పాడి రిలీజ్ చేయగా.. అది వైరల్ అవుతోంది.
థాట్రోమ్ థుక్కరోమ్ పేరిట విడుదలైన పాటలో పేదలు ఈ ఏడాది కాలంలో ఎదుర్కున్న కష్టాల గురించి తెలియజేస్తూ శింబు గళం విప్పాడు. నోట్ల రద్దు తర్వాత మొదలు.. జీఎస్టీతో సామాన్య ప్రజలపై మరింత భారం మోపారని.. రుణాల కోసం వచ్చే రైతుల మెడ బట్టి గెంటేస్తున్నారని.. అదే విజయ్ మాల్యా లాంటి వాళ్లకు భారీగా రుణాలు ఇచ్చి వారిని దేశం దాటిస్తున్నారని... ఇలా పాట మొత్తం కేంద్ర విధానాలను తప్పుబట్టేలా సాహిత్యంతో పొందుపరిచారు. బాలమురుగన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఇప్పుడు అక్కడి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
రివర్స్ గేర్...
గతేడాది నోట్ల రద్దు సమయంలో మోదీ నిర్ణయాన్ని సమర్థించిన సినీ సెలబ్రిటీల్లో కమల్ హాసన్‌తోపాటు శింబు కూడా ఉన్నాడు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశాడు కూడా. అలాంటిది ఇప్పుడు అదే నిర్ణయాన్ని తప్పుబడుతూ రాసిన పాటకు గొంతు అరువు ఇవ్వటం విశేషం. కాగా, మెర్సల్ సినిమాపై అనవసర వివాదం.. కమల్ హాసన్ రాజకీయ ఆరంగ్రేటంపై, విమర్శలు-ప్రతి విమర్శలతో అక్కడి సెలబ్రిటీలలో నానాటికీ బీజేపీ వ్యతిరేకత పెరిగిపోతుండటం స్పష్టంగా గమనించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment