Simbu sings
-
శింబు రివర్స్ గేర్.. వైరల్
-
శింబు రివర్స్ గేర్.. వీడియో వైరల్
సాక్షి, చెన్నై : కోలీవుడ్ యంగ్ హీరోల్లో శింబుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మల్టీ టాలెంటెడ్ అయిన శింబు ఓ మంచి సింగర్ కూడా. సినిమాలకే కాదు.. ప్రైవేట్‌గా కూడా ఆయన పాటలు పాడుతుంటారు. గతంలో మహిళలను కించపరుస్తూ ఆయన పాడిన బీప్ సాంగ్ పెను దుమారమే లేపింది. ఇదిలా ప్రస్తుతం ఆయన నోట్ల రద్దుకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఓ పాట పాడి రిలీజ్ చేయగా.. అది వైరల్ అవుతోంది. థాట్రోమ్ థుక్కరోమ్ పేరిట విడుదలైన పాటలో పేదలు ఈ ఏడాది కాలంలో ఎదుర్కున్న కష్టాల గురించి తెలియజేస్తూ శింబు గళం విప్పాడు. నోట్ల రద్దు తర్వాత మొదలు.. జీఎస్టీతో సామాన్య ప్రజలపై మరింత భారం మోపారని.. రుణాల కోసం వచ్చే రైతుల మెడ బట్టి గెంటేస్తున్నారని.. అదే విజయ్ మాల్యా లాంటి వాళ్లకు భారీగా రుణాలు ఇచ్చి వారిని దేశం దాటిస్తున్నారని... ఇలా పాట మొత్తం కేంద్ర విధానాలను తప్పుబట్టేలా సాహిత్యంతో పొందుపరిచారు. బాలమురుగన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఇప్పుడు అక్కడి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రివర్స్ గేర్... గతేడాది నోట్ల రద్దు సమయంలో మోదీ నిర్ణయాన్ని సమర్థించిన సినీ సెలబ్రిటీల్లో కమల్ హాసన్‌తోపాటు శింబు కూడా ఉన్నాడు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశాడు కూడా. అలాంటిది ఇప్పుడు అదే నిర్ణయాన్ని తప్పుబడుతూ రాసిన పాటకు గొంతు అరువు ఇవ్వటం విశేషం. కాగా, మెర్సల్ సినిమాపై అనవసర వివాదం.. కమల్ హాసన్ రాజకీయ ఆరంగ్రేటంపై, విమర్శలు-ప్రతి విమర్శలతో అక్కడి సెలబ్రిటీలలో నానాటికీ బీజేపీ వ్యతిరేకత పెరిగిపోతుండటం స్పష్టంగా గమనించవచ్చు. -
రమ్ కోసం శింబు పాట
సంచలన నటుడు శింబు రమ్ కోసం గొంతు విప్పారు. ఏమిటీ ఏదేదో ఊహించుకుంటున్నారా? అలాంటిదేమీలేదుగానీ, రమ్ అనే చిత్రం కోసం ఆయన ఒక పెప్పీ పాటను పాడారన్నమాట. శింబుకు పాడడం కొత్తేమీకాదు. అయితే కొన్ని పాటలను రెగ్యులర్ గాయకులు పాడడం కంటే శింబు లాంటి నటులు పాడితే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇక ఆయనకు మరో సంచలన సంగీత దర్శకుడు తోడైతే చె ప్పే అవసరం లేదు. ఎస్.శింబు, అనిరుద్‌ల కలయికలో రూపొందిన పాటను త్వరలో వినబోతున్నాం మనం. రమ్ చిత్రం కోసం అనిరుద్ బాణీలు కట్టిన జిబ్బిరిష్ అనబడే పూర్తిగా భావంలేని పేయోఫోబిలియా అనే పల్లవితో కూడిన పాటను శింబు పాడితేనే బాగుంటుందని ఆయన భావించారట. దెయ్యాలకు మనం భయపడాలో కూడదో.. దెయ్యాల కంటే భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం అనే పదజాలాలతో కూడిన గీత రచయిత వివేక్ రాసిన ఈ పాటను శింబు పర్ఫెక్ట్గా పాడారని అనిరుద్ తెలిపారు. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న రమ్ చిత్రాన్ని ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత విజయరాఘవేంద్ర నిర్మిస్తున్నారు. నవ దర్శకుడు సాయిభరత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హ్రిహికేష్, సంచితాశెట్టి, మియాజార్జ్, వివేక్, నరేన్, అజ్మద్, అర్జున్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక ఇంటిలోని అమానుష శక్తుల నేపథ్యంలో జరిగే చిత్రమే రమ్ అని చిత్ర వర్గాలు తెలిపారు.శింబు పాడిన ఈ పాట కచ్చితంగా విశేష ఆదరణను పొందుతుందన్న నమ్మకాన్ని సంగీతదర్శకుడు అనిరుద్ వ్యక్తం చేస్తున్నారు.