శింబు రివర్స్ గేర్‌.. వైరల్‌ | simbu's Thatrom Thookrom Demonetization Anthem Viral | Sakshi
Sakshi News home page

శింబు రివర్స్ గేర్‌.. వైరల్‌

Published Thu, Nov 9 2017 6:45 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

కోలీవుడ్ యంగ్‌ హీరోల్లో శింబుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మల్టీ టాలెంటెడ్‌ అయిన శింబు ఓ మంచి సింగర్ కూడా. సినిమాలకే కాదు.. ప్రైవేట్‌గా కూడా ఆయన పాటలు పాడుతుంటారు. గతంలో మహిళలను కించపరుస్తూ ఆయన పాడిన బీప్‌ సాంగ్‌ పెను దుమారమే లేపింది. ఇదిలా ప్రస్తుతం ఆయన నోట్ల రద్దుకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఓ పాట పాడి రిలీజ్ చేయగా.. అది వైరల్ అవుతోంది. థాట్రోమ్‌ థుక్కరోమ్‌ పేరిట విడుదలైన పాటలో పేదలు ఈ ఏడాది కాలంలో ఎదుర్కున్న కష్టాల గురించి తెలియజేస్తూ శింబు గళం విప్పాడు. నోట్ల రద్దు తర్వాత మొదలు.. జీఎస్టీతో సామాన్య ప్రజలపై మరింత భారం మోపారని.. రుణాల కోసం వచ్చే రైతుల మెడ బట్టి గెంటేస్తున్నారని.. అదే విజయ్‌ మాల్యా లాంటి వాళ్లకు భారీగా రుణాలు ఇచ్చి వారిని దేశం దాటిస్తున్నారని... ఇలా పాట మొత్తం కేంద్ర విధానాలను తప్పుబట్టేలా సాహిత్యంతో పొందుపరిచారు. బాలమురుగన్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సాంగ్ ఇప్పుడు అక్కడి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement