లవర్ తో పెళ్లికి నో చెప్పిన పాప్ స్టార్! | singer Calvin Harris refused to marry Taylor Swift | Sakshi
Sakshi News home page

లవర్ తో పెళ్లికి నో చెప్పిన పాప్ స్టార్!

Published Sat, Jun 4 2016 6:04 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

లవర్ తో పెళ్లికి నో చెప్పిన పాప్ స్టార్!

లవర్ తో పెళ్లికి నో చెప్పిన పాప్ స్టార్!

స్టార్ మ్యుజీషియన్, సింగర్ కెల్విన్ హారిస్, టేలర్ స్విఫ్ట్ ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని తేల్చి పారేశాడు. సింగర్, లిరిక్స్ రైటర్ అయిన టేలర్ తో ఏడాది పాటు కెల్విన్ అన్యోన్యంగా ఉంటూ వచ్చాడు. ఏమైందో తెలియదు గానీ, వీరిద్దరూ వివాహం చేసుకుంటార్న వార్తలు ప్రచారం కాగానే తమ బంధానికి మంగళం పాడేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే టేలర్ స్విఫ్ట్ తో తాను వివాహ బంధానికి సిద్దంగా లేనని చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. అందుకే గత కొన్ని రోజులుగా ఇద్దరు ఎడమొహం పెడమెహంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కెల్విన్ హారిస్ తో తన జీవితం సరైన మార్గంలో వెళ్లడం లేదని టేలర్ కూడా భావించింది.

గతంలో పాప్ సింగర్ రీటా ఓరాతో పన్నెండు మాసాల లవ్ రిలేషన్ కు కటీఫ్ చెప్పిన హారిస్.. ఆ సమయంలో డిప్రెషన్‌లో ఉన్నాడు. హారిస్ పై రీటా చాలా సీరియస్ అయింది. ఓ అవార్డుల ఫంక్షన్‌లో పెర్‌ఫార్మ్ చెయ్యకుండా తనను హారిస్ అడ్డుకున్నాడని తెలిపింది. రీటా ఓరాతో కూడా బ్రేకప్ కావడంలో హారిస్ దే తప్పు అని అందరూ భావిస్తున్నారు. తన జీవితంలో అమేజింగ్ పర్సన్ ఎదురయ్యాడంటూ హారిస్ ను పొగిడేసిన టేలర్ కూడా ప్రస్తుత రిలేషన్ పై అంతగా స్పందించడం లేదు. పెళ్లంటే తనకు ఇష్టం లేదని హారిస్ గతంలో గర్ల్ ఫ్రెండ్స్ తో రిలేషన్ ఉన్నప్పుడు వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement