హీరోలపై గాయని సంచలన ఆరోపణలు | Singer Suchitra Karthik alleges attack by Dhanush’s team in cryptic tweets | Sakshi
Sakshi News home page

హీరోలపై గాయని సంచలన ఆరోపణలు

Published Fri, Feb 24 2017 10:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

హీరోలపై గాయని సంచలన ఆరోపణలు

హీరోలపై గాయని సంచలన ఆరోపణలు

చెన్నై(తమిళ సినిమా): హీరోలు ధనుష్‌, శింబుపై గాయని సుచిత్ర సంచలన ఆరోపణలు గుప్పించారు. ఒక పక్క నటి భావన కిడ్నాప్‌ సంఘటన చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తున్న నేపథ్యంలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ వంటి కొందరు నటీమణులు తమకు ఎదరైన చేదు అనుభవాలను నిర్భయంగా వెల్లడిస్తుండడం పరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ధనుష్, శింబు తనపై దురుసుగా ప్రవర్తించారంటూ గాయని సుచిత్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది.

ధనుష్‌, శింబు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే సుచిత్ర ట్విట్టర్‌లో ఎవరో ఇలా తప్పుగా పోస్ట్‌ చేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో గాయని సుచిత్ర తన సెల్ఫీ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘మళ్లీ ట్విట్టర్‌లోకి వచ్చాను. నేను క్షేమంగా ఉన్నాను. ధనుష్‌ ప్రవర్తన గురించి అందరికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది కల్పన కాదు. శింబు నువ్వు కూడా ఉన్నావ’ని పేర్కొన్నారు. అదే సమయంలో గాయని సుచిత్ర, ధనుష్‌ నాకు దేవుడిలాంటి వారని పొగడ్తలతోనూ ముంచెత్తారు. తన విరుద్ధ భావ ప్రకటనలు అభిమానుల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. సుచిత్ర బహిరంగంగా ఈ విషయం గురించి వెల్లడిస్తేగానీ నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.

పోకిరి చిత్రంలో డోలు డోలు, కాక్క కాక్క చిత్రంలో ఉయిరిన్‌ ఉయిరే వంటి పలు పాటలను పాడిన సుచిత్ర పలువురు హీరోయిన్లకు డబ్బింగ్‌లు చెప్పారు. అంతే కాదు జేజే, ఆయుధ ఎళుత్తు, బలే పాండియా వంటి పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement