ఏయ్ అబ్బాయ్...గౌరవించడం నేర్చుకో!
తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో వివాహ బంధాన్ని తెగ తెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటి నుంచీ అమలాపాల్ మీద చాలా విమర్శలొస్తున్నాయ్. అత్తామామలకు ఆమె తీరు నచ్చకపోవడంవల్లే ఇదంతా జరిగిందన్నది కొందరి అభిప్రాయం. విజయ్‌లాంటి వ్యక్తిని వదులుకోవడం అమలాపాల్ చేస్తున్న పెద్ద తప్పన్నది మరి కొందరి ఒపీనియన్. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికే అమలాపాల్‌కి అవకాశాలు రానివ్వకుండా చెన్నై చిత్రసీమలో పావులు కదుపుతున్నారనే టాక్ ఉంది.
ఇక, పుండు మీద కారం చల్లినట్లు, ‘విడాకులు తీసుకున్న మహిళలు ఎప్పుడూ హాట్‌గా, నాటీగా ఉంటారు’ అని ఓ ఆకతాయి సోషల్ మీడియాలో అమలా పాల్‌ని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌ని అమలాపాల్ లైట్‌గా తీసుకోలేదు. ‘‘ఏయ్ అబ్బాయ్.. నీ యాంబిషన్ రాంగ్ డెరైక్షన్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ప్లీజ్.. మహిళలను గౌరవించడం నేర్చుకో’’ అని సదరు ఆకతాయికి కాస్త ఘాటుగానే కౌంటర్ రిప్లై ఇచ్చారు. కానీ, తాను విజయ్ నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో మాత్రం చెప్పలేదు. విడాకులు తీసుకోవడమనేది వ్యక్తిగత విషయం కాబట్టి స్పందించడం లేదనుకోవచ్చు. మరోవైపు విజయ్ కూడా ఈ విషయం గురించి నోరు విప్పడంలేదు. రచ్చ చేసుకోకుండా సెలైంట్‌గా విడిపోవాలనుకుని ఉంటారు.