బాలయ్యతో ఎవరైనా లవ్‌లో పడతారు! | Someone will fall in love with Balayya! | Sakshi
Sakshi News home page

బాలయ్యతో ఎవరైనా లవ్‌లో పడతారు!

Published Tue, Sep 5 2017 12:03 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

బాలయ్యతో ఎవరైనా లవ్‌లో పడతారు! - Sakshi

బాలయ్యతో ఎవరైనా లవ్‌లో పడతారు!

‘‘బాలయ్యకు నేను బాగా నచ్చేశాను. మళ్లీ మనం మరో సినిమా చేద్దామన్నారు. బాలయ్య 103వ సినిమా ప్లాన్‌ చేస్తున్నా’’ అన్నారు పూరి జగన్నాథ్‌. బాలకృష్ణ హీరోగా ఆయన దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన ‘పైసా వసూల్‌’ గత శుక్రవారం విడుదలైంది. సిన్మాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందంటూ పూరి చెప్పిన విశేషాలు...

► బాలయ్యను దృష్టిలో పెట్టుకునే ‘తేడా సింగ్‌’ క్యారెక్టర్‌ డిజైన్‌ చేశా. నాకు ఆయన నవ్వంటే చాలా ఇష్టం. నవ్వును హైలైట్‌ చేస్తూ సీన్లు రాశా. అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా సిన్మాను ఎంజాయ్‌ చేస్తున్నారు. బ్యాంకాక్‌కు వీడియోకాల్‌ చేశా. ‘జై బాలయ్య’ అన్నప్పుడల్లా అరుపులే.

బాపుగారి సినిమాలు ఓ స్టైల్‌లో, వర్మగారి సినిమాలు మరో స్టైల్‌లో ఉంటాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. నా స్టైల్‌ నాది. నా గత సినిమాల్లో డాన్స్, గన్స్‌ ఉన్నాయి కనుక కొందరు వాటితో పోలుస్తున్నారు


► బాలయ్యకు క్రమశిక్షణ ఎక్కువ. లోపల ఒకటి, బయటకు ఇంకొకటి మాట్లాడే వ్యక్తి కాదు. సెట్‌లోకి వచ్చినప్పుడు, సెట్‌ నుంచి వెళ్లేటప్పుడు అందర్నీ పలకరిస్తారు. బాలయ్యను దగ్గర్నుంచి చూస్తే ఎవరైనా లవ్‌లో పడతారు. ఆయనలో మంచి లక్షణాలెన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎవరూ రాయరు. ఎవర్నో కొట్టారని మాత్రం రాస్తారు

నెక్ట్స్‌ ఆకాశ్‌ హీరోగా ఓ ప్రేమకథ ప్లాన్‌ చేస్తున్నా. తమ్ముడైనా, కొడుకైనా... నా కథేంటి? క్యారెక్టర్‌ ఏంటి? అనడుగుతారు కదా! చెప్పాలి.


‘‘డ్రగ్స్‌ ఇష్యూలో ఎంక్వయిరీ కోసం పిలిస్తే... నాపై చాలా స్టోరీలు చేశారు. బాధపడ్డా. అది అసలు కేసే కాదు. ఇవాళ గడవడం కోసం ఏదొకటి చేయడం తప్పు అని నా అభిప్రాయం’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement