![Puri Jagannadh Planing A Movie With Balakrishna - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/17/Puri%20Balayya.jpg.webp?itok=ZTN_mtBD)
ఇస్మార్ట్ శంకర్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ సినిమాను ప్రకటించిన పూరీ, మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టే ఆలోచనలో ఉన్నాడు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన పైసా వసూల్ బాలయ్య అభిమానులను ఫుల్ ఖుషీ చేసింది. అప్పట్లో బాలయ్య కూడా పూరితో మరోసారి కలిసి పనిచేయాలనుందని ప్రకటించారు. అయితే తాజాగా పూరీ, బాలయ్యకు ఓ కథ వినిపించారట. ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ, తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత పూరీ, బాలయ్య కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment