
సాక్షి, ముంబై : మీటూ ఉద్యమ నేపథ్యంలో ప్రముఖ టీవీ నటి సొనాల్ వెంగురేల్కర్ పరిశ్రమలో గతంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెల్లడించారు. తాను పరిశ్రమలోకి రాకమునుపు 19 ఏళ్ల వయసులో ఫొటోగ్రాఫర్, క్యాస్టింగ్ డైరెక్టర్ రాజ బజాజ్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించాడని ఆరోపించారు. తాను తాంత్రిక విద్యలు నేర్పుతానని, వాటితో రాత్రికి రాత్రే విజేతలవుతారని మభ్యపెడుతూ తన దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించాడని, బలవంతంగా తన ఛాతీపై క్రీమ్‌ను రాశాడని చెప్పారు. ఓ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆడిషన్ అవకాశం చూసి రాజ బజాజ్‌ను సంప్రదించిన క్రమంలో తనకు ఈ చేదు అనుభవం ఎదురైందని వెల్లడించారు.
రాజ తీరుకు షాక్‌కు గురైన తాను 2012లోనే కస్తూర్బా మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు. కాగా సొనాల్ ఆరోపణలను రాజ బజాజ్ తోసిపుచ్చారు. సొనాల్ మార్చి ఏడున తన ఇంటికి వచ్చి డబ్బు డిమాండ్ చేశారని, రూ 3 లక్షలు డిమాండ్ చేసిన సొనాల్ తర్వాత రూ 1.5 లక్షలకు దిగివచ్చారని అందుకు తాము తిరస్కరించడంతోనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment