బాక్సాఫీస్ 'రాణి' ఎవరు? | Sonam Kapoor vs Deepika Padukone - who'll win the box office game? | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్ 'రాణి' ఎవరు?

Published Tue, Sep 9 2014 4:03 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాక్సాఫీస్ 'రాణి' ఎవరు? - Sakshi

బాక్సాఫీస్ 'రాణి' ఎవరు?

న్యూఢిల్లీ:బాలీవుడ్ లో 'ఓం శాంతి ఓం' చిత్రంతో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకునే ఆపై వెనుదిరిగి చూడలేదు. ఈ చిత్రం వచ్చి ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా.. దీపికా పదుకునే బాక్సాఫీస్ 'రాణి'గా  తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఆమెకు ఈ క్రెడిట్ రావడానికి అదే సంవత్సరం(2007) వచ్చిన 'సావారియా' చిత్రం కూడా దోహదం చేసింది. అయితే తొలిసారి ఆమెకు మరో బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ నుంచి పోటీ ఎదురు కానుంది. ప్రస్తుతం దీపికా పదుకునే 'ఫైండింగ్ ఫన్నీ ' చిత్రంతో అలరించడానికి సిద్ధంగా ఉండగా, సోనమ్ కపూర్ 'ఖూబ్ సూరత్' తో మన  ముందుకు రానుంది.

 

ఒక వారం వ్యవధిలో రానున్న ఈ రెండు చిత్రాల మధ్య  తీవ్రమైన పోటీ ఉంటుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబర్ 12 వ తేదీన దీపికా పదుకునే చిత్రం విడుదలకు అవుతుండగా, సెప్టెంబర్ 19 వ తేదీన సోనమ్ చిత్రం విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఈ రెండు ప్రయోగాత్మాక చిత్రాలు ఎవరిని బాక్సాఫీస్ 'రాణి'గా నిలబెడతాయో వేచి చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement