సోను సూద్కు పితృవియోగం | Sonu Sood’s father Shakti Sagar passes away, actor says he is shattered | Sakshi
Sakshi News home page

సోను సూద్కు పితృవియోగం

Published Mon, Feb 8 2016 6:35 PM | Last Updated on Tue, Jul 31 2018 5:31 PM

సోను సూద్కు పితృవియోగం - Sakshi

సోను సూద్కు పితృవియోగం

బాలీవుడ్ నటుడు సోను సూద్కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శక్తి సాగర్ సూద్ (77) ఆదివారం పంజాబ్లోని మోగాలో మృతి చెందారు.

ముంబై : బాలీవుడ్ నటుడు సోను సూద్కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శక్తి సాగర్ సూద్ (77) ఆదివారం పంజాబ్లోని మోగాలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గత నాలుగేళ్లుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా శక్తి సూద్... సోను సూద్తో  మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలడంతో, ఆయనను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. 

అయితే అప్పటికే శక్తి సూద్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు సోను సూద్తో పాటు ఇద్దరు కుమార్తెలు (మోనికా, మాళవిక). విదేశాల్లో ఉన్న సోను సోదరి  మంగళవారం రానున్నారు. అనంతరం శక్తి సూద్ అంత్యక్రియలు జరుగుతాయి.

కాగా ఎనిమిదేళ్ల క్రితం సోను సూద్ తల్లి సరోజ్ సూద్ మృతి చెందారు. అయితే అప్పటి నుంచి శక్తి సూద్  పంజాబ్లో ఒంటరిగానే ఉంటున్నారు.  ముంబయిలో తనతో కలిసి ఉండాలని తండ్రిపై సోను ఎంత ఒత్తిడి తెచ్చినా... ఆయన మాత్రం పంజాబ్లో ఉండేందుకే ఇష్టపడ్డారని సన్నిహితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement