‘‘అమ్మా.. జీవితాంతం నాకు నువ్వు మార్గదర్శనం చేస్తూనే ఉండాలి. గట్టిగా హత్తుకుని.. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలని ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా మమ్మల్ని మిస్సవుతూనే ఉంటావని తెలుసు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అయితే నువ్వు ఎప్పటిలాగే నాకు దారి చూపే దేవతగా ఉండాలి. నిన్ను మళ్లీ కలిసేంత వరకు మిస్సవుతూనే ఉంటాను. హ్యాపీ బర్త్‌డే అమ్మా. మిస్ యూ’’ అంటూ బాలీవుడ్ నటుడు సోనూసూద్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లి జయంతి సందర్భంగా ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ చిన్ననాటి ఫొటోలను మంగళవారం ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో నెటిజన్ల నుంచి సోనూసూద్ తల్లికి శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఇంత గొప్ప కొడుకును కన్న మీకు ధన్యవాదాలు. ఇతరులకు సాయం చేయాలనే గుణం మీ నుంచే అలవడి ఉంటుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అంటూ విషెస్ చెబుతున్నారు.(సోనూ సూద్ ఉదారత)
కాగా కరోనా కట్టడికై విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఎంతో మంది వలస కూలీలకు సోనూసూద్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. సొంత ఖర్చులతో వారిని స్వస్థలాలకు చేర్చి నిజమైన హీరోగా నీరాజనాలు అందుకున్నాడు. తన హోటల్‌ను క్వారంటైన్ సెంటర్‌గా మార్చడం సహా పీపీఈ కిట్లు విరాళంగా ఇచ్చి ఫ్రంట్‌లైన్ వారియర్ల పట్ల కృతఙ్ఞతా భావం చాటుకున్నాడు. అదే విధంగా ముంబైలో నిసర్గ ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. ఇక బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించిన సోనూసూద్ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.(28 వేల మందికి సోనూసూద్ సాయం..)
Comments
Please login to add a commentAdd a comment