బాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించిన స్పెషల్ 26 చిత్రం ఇప్పుడు దక్షిణాది భాషల్లో మరింత స్పెషల్‌గా తయారవడానికి సిద్ధమవుతోందన్నది తాజా వార్త. సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు త్యాగరాజన్ ఈ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఈయన మరో బాలీవుడ్ హిట్ చిత్రం క్వీన్ హక్కులను పొందారు. తాజా చిత్రం స్పెషల్ 26 రీమేక్‌లో దక్షిణాది భాషలకు చెందిన నలుగురు ప్రముఖ హీరోలు అజయ్‌దేవగన్ పాత్రను పోషించనున్నారు. తమిళంలో ప్రశాంత్, తెలుగులో రవితేజ నటించనున్నారని త్యాగరాజన్ తెలిపారు.
కన్నడ, మలయాళ భాషలలో దర్శన్, దిలీప్‌లు నటించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వారితో చర్చలు జరుపుతున్నట్లు మరో రెండు రోజుల్లో ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. హిందీలో మనోజ్‌భాజ్‌పాయ్, అనుపమ్‌ఖేర్‌లు పోషించిన పాత్రలను తమిళంలో ప్రకాష్‌రాజ్, సత్యరాజ్ పోషించనున్నట్లు తెలిపారు. వీరితో పాటు నాజర్, షియాజి షిండే, ఎంఎస్ భాస్కర్, రావు రమేష్, బ్రహ్మాజి, హేమ, తులసి తదితరులు నటించనున్నారని వెల్లడించారు.
ఇక హీరోయిన్‌గా దక్షిణాదిలోని ప్రముఖ నటిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆమె ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తానన్నారు. బాలీవుడ్ దర్శకుడు నీరజ్‌ఫాండే తొలి చిత్రం వెడ్‌నెస్‌డే చిత్రం చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని త్యాగరాజన్ అన్నారు. మంచి సోషల్ మెసేజ్ వున్న ఆ చిత్రం రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నించగా అప్పటికే అవి అమ్ముడైపోయినట్లు తెలిసిందన్నారు. అదే దర్శకుడు తెరకెక్కించిన ఈ స్పెషల్ 26 వైవిధ్య భరిత థ్రిల్లర్ కథతో రూపొంది మంచి విజయాన్ని సాధించడంతో దీన్ని రీమేక్ హక్కులు పొందినట్లు త్యాగరాజన్ వివరించారు.
‘ఆ నలుగురి’ తో స్పెషల్ 26 రీమేక్
Published Fri, Nov 14 2014 7:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement