అమ్మాయిలను ఈజీగా పడేస్తా! | special chit chat with bellam konda srinivas | Sakshi
Sakshi News home page

అమ్మాయిలను ఈజీగా పడేస్తా!

Published Thu, Feb 4 2016 11:25 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

అమ్మాయిలను ఈజీగా పడేస్తా! - Sakshi

అమ్మాయిలను ఈజీగా పడేస్తా!

నా మొదటి సినిమాలో తమన్నా ఐటమ్‌సాంగ్ చేసింది. ఇప్పుడీ సినిమా లోనూ ఆమెతో డ్యాన్స్ చేశాను. తమన్నా మంచి డ్యాన్సర్. ఒక మంచి జోష్ ఉన్న సాంగ్ అంటే తనే చేయాలి అన్నట్లుగా తమన్నా డ్యాన్స్ ఉంటుంది. మేమిద్దరం ఒకే వయసువాళ్లం కాబట్టి, ఫ్రెండ్లీగా ఉంటాం. అవకాశమొస్తే తనతో హీరోగా చేయడానికి రెడీ. ‘బాహుబలి’ తర్వాత తమన్నా రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది

‘‘మొదటి సినిమా ‘అల్లుడు శీను’ చేశాక దాదాపు 30 - 40 కథలు విన్నాను. కానీ, ఏదీ పెద్దగా నచ్చలేదు. తమిళ ‘సుందరపాండియన్’ కథ చాలా నచ్చింది. మరో పది సినిమాలు చేశాక కూడా నా రెండో సినిమాగా ‘స్పీడున్నోడు’ చేసినందుకు ఆనందపడతా’’ అని యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనారిక జంటగా గుడ్‌విల్ సినిమా పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో భీమనేని సునీత నిర్మించిన ‘స్పీడున్నోడు’ ఇవాళ విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ చెప్పిన ముచ్చట్లు...

యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు ఎవరికైనా నప్పే కథ - ‘సుందరపాండియన్’. అలాగే, ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే కథ. స్నేహం నేపథ్యంలో సాగే ఈ చిత్రకథ గురించి దర్శ కుడు భీమనేని చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. క్లయిమ్యాక్స్ అయితే మతి పోతుంది. థియేటర్ నుంచి బయటికొచ్చాక కూడా వెంటాడే చిత్రం ఇది.ఇందులో స్నేహితుల కోసం ఏం చేయడానికైనా వెనకాడని యువకుడిగా నటించాను. అమ్మాయిలను ఈజీగా పడేస్తానన్న మాట. అమ్మాయిలను ఎలా పడేయాలో నా ఫ్రెండ్స్ నన్ను టిప్స్ అడుగుతుంటారు. సినిమా కోసం ఇలా అమ్మాయిలను పడేసే అబ్బాయిగా నటించా కానీ, రియల్ లైఫ్‌లో అలాంటివాణ్ణి కాదు.

 టైటిల్‌కి తగ్గట్టే నా క్యారెక్టర్ చాలా స్పీడ్‌గా ఉంటుంది. నిజంగా కూడా నేను చాలా స్పీడ్. వాస్తవానికి ‘ఎస్’ అక్షరం మీద భీమనేనిగారు ఏవేవో టైటిల్స్ అనుకున్నారు కానీ, చివరకు నా స్పీడు, సినిమాలో నా క్యారెక్టర్ స్పీడు దృష్టిలో పెట్టుకుని ‘స్పీడున్నోడు’ అని ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం హెయిర్ స్టయిల్, లుక్, కాస్ట్యూమ్స్, మేకప్, డబ్బింగ్ - అన్నింటిలోనూ ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వచ్చింది.
  స్నేహం నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి, నా ఫ్రెండ్స్ కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించా. అందరికీ ఈ సినిమా కనెక్ట్ అయింది. సినిమా చూశాక కొంతమంది సెలైంట్‌గా అభినందిస్తే, కొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చారు. మరికొంతమంది బాగా ప్రశంసించారు. క్లయిమ్యాక్స్‌లో ఎలాంటివారైనా ఎమోషన్‌కి గురవుతారు. నాన్నగారైతే సినిమా చూశాక, నన్ను గట్టిగా హత్తుకున్నారు. అమ్మకైతే ఆనందంతో నోట మాట రాలేదు. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చెప్పేసింది.

 ‘మీ ఫస్ట్ సినిమాకు బాగా ఖర్చు పెట్టారు కదా?’ అని నాతో చాలామంది అంటుంటారు. ఇప్పుడీ సినిమాకి కూడా బాగా ఖర్చయ్యింది. మొదటి సినిమాకు బాగా చేసి, రెండో సినిమాను మామూలుగా చేయలేం కదా. ఇక, రిటర్న్స్ అంటారా? తప్పకుండా వస్తాయి. నిజానికి, నా రెండో సినిమా బోయపాటి శ్రీనుగారితో చేయాల్సింది. కానీ, కథ సరిగ్గా కుదరలేదు. ఆ దశలోనే ఆపడం వల్ల ఆ సినిమాలోని లుక్ కోసం నేను ప్రత్యేకంగా వర్కవుట్స్ చేయలేదు. ‘స్పీడున్నోడు’ చేద్దామనుకున్నాక దానికి తగ్గట్టుగా మౌల్డ్ అయ్యాను. మూడో సినిమా ఆయనతోనే ఉంటుంది. అలాగే, విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement