రబ్బరు బొమ్మ...బ్యాచిలర్ బాబులు! | eedunnodu Bachelor Babu Song trailer Bellamkonda Srinivas,Tamanna | Sakshi
Sakshi News home page

రబ్బరు బొమ్మ...బ్యాచిలర్ బాబులు!

Published Thu, Jan 28 2016 10:53 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

రబ్బరు బొమ్మ...బ్యాచిలర్ బాబులు! - Sakshi

రబ్బరు బొమ్మ...బ్యాచిలర్ బాబులు!

 మిల్క్ బ్యూటీ తమన్నా, కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేసిన స్పెషల్ సాంగ్ ‘రబ్బరు బొమ్మ..’ గుర్తుందా? ‘అల్లుడు శీను’లోని ఆ పాట కుర్రకారుకి తెగ నచ్చేసింది. ఇప్పుడు మళ్లీ ‘స్పీడున్నోడు’ కోసం చిత్రకథానాయకుడు సాయి శ్రీనివాస్‌తో తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌కి జతకట్టారు. అప్పుడేమో ‘రబ్బరు బొమ్మ...’ అంటూ ఆడి పాడిన ఈ జంట.. ఇప్పుడు ‘బ్యాచిలర్ బాబులు..’ అంటున్నారు. ఈ పాట ఓ హైలైట్‌గా నిలుస్తుందని చిత్రదర్శకుడు భీమనేని శ్రీనివాసరావు చెప్పారు.
 
 తమిళ సూపర్ హిట్ ‘సుందరపాండ్యన్’కి రీమేక్‌గా ఆయన దర్శకత్వంలో భీమనేని సునీత ఈ చిత్రం నిర్మించారు. వచ్చే నెల 5న విడుదల కానుంది. ‘సుడిగాడు’వంటి హిట్ తర్వాత ఆ విజయాన్ని కొనసాగించే చిత్రం తీయాలనుకునే పట్టుదలతో ఈ చిత్రం చేశానని భీమనేని అన్నారు. ఆల్రెడీ ఓ భాషలో హిట్ అయిన సినిమా కావడంవల్ల, పాటలు, పోస్టర్స్‌కి మంచి స్పందన రావడంవల్ల బిజినెస్ హాట్ కేక్‌లా అయ్యిందట. ఈ చిత్రానికి సంగీతం: డి.జె. వసంత్, సమర్పణ: వివేక్ కూచిబొట్ల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement