అల్లుడు శీనుతో మిల్కీ బ్యూటీ రొమాన్స్ | Tamanna to romance with Allu Seenu | Sakshi
Sakshi News home page

అల్లుడు శీనుతో మిల్కీ బ్యూటీ రొమాన్స్

Published Tue, Aug 26 2014 1:06 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

అల్లుడు శీనుతో మిల్కీ బ్యూటీ రొమాన్స్ - Sakshi

అల్లుడు శీనుతో మిల్కీ బ్యూటీ రొమాన్స్

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో మళ్లీ జోరు పెంచింది. వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే రెండు భారీ సినిమాల్లో నటిస్తున్న ఈ అందాల భామ మరో సినిమాకు సంతకం చేసింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ తో జతకట్టేందుకు తమన్నా అంగీకరించింది. అల్లుడు శీనుతో తెరంగ్రేటం చేసిన శ్రీనివాస్ రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాలో నటిస్తున్నట్టు తమన్నా ధ్రువీకరించింది. స్క్రిప్ట్ తనకెంతో నచ్చిందని, తన పాత్ర బాగా కుదిరిందని ఆమె తెలిపింది. మిగతా వివరాలు వెల్లడించేందుకు ఆమె నిరాకరించింది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పింది. అయితే శ్రీనివాస్ తో మొదటి సినిమాలోనే తమన్నా నటించింది. అల్లుడు శీను లో ఐటెం సాంగ్ లో తమన్నా మెరిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement