నియాంకా  జోప్రా | special story to Priyanka Chopra and Nick Jonas | Sakshi
Sakshi News home page

నియాంకా  జోప్రా

Published Sat, Aug 25 2018 12:01 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

special story to  Priyanka Chopra and Nick Jonas  - Sakshi

ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌ల నిశ్చితార్థం జరిగిపోయింది. పెళ్లి కూడా అక్టోబర్‌లో నిశ్చయమే అన్న మాటా వినిపిస్తోంది. ఏమైనా ఎంగేజ్‌మెంట్‌తో వాళ్ల చుట్టూ ఎంగేజ్‌ అయిన కొన్ని రూమర్స్‌ ఇక తగ్గుముఖం పట్టినట్లే. ఈ ఇద్దరి మధ్య పరిచయం.. ప్రేమగా మారి నిశ్చితార్థం వరకూ వెళ్లిన తీరుకి ప్రత్యక్ష సాక్షి ఎవరో తెలుసా?! ఇన్‌స్టాగ్రామ్‌! ఆ ప్రేమ పరిణామక్రమం ఏంటో ఒకసారి చూద్దాం. 

మే 1, 2017
‘మెట్‌ గాలా’ లో ఇద్దరూ కలిసి తొలిసారిగా కనిపించారు. అంతకుముందే ప్రియాంక చోప్రా.. జిమ్మి కిమ్మెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘మెట్‌ గాలా ఈవెంట్‌కు నేను, జోనస్‌ ఇద్దరం కూడా రాల్ఫ్‌ లారెన్‌ బ్రాండ్‌ బట్టలనే వేసుకోబోతున్నాం’’ అని చెప్పింది. అంటే ఆ ఈవెంట్‌కి వాళ్లిద్దరూ కలిసి వెళ్లాలని అప్పటికే నిర్ణయించుకున్నారన్నమాట. ఆ వేడుక అయిపోయాక ఆ ఈవెంట్‌ నైట్‌ను ‘‘ఫ¯Œ నైట్‌’’గా పోస్ట్‌ చేసుకుంది ప్రియాంక.

మే 25, 2018
మెట్‌ గాలా ఈవెంట్‌ తర్వాత మళ్లీ వాళ్లిద్దరూ జంటగా కనిపించారు. లాస్‌ఏంజెలిస్‌లో మెమోరిల్‌ డే వీకెండ్‌ను కలిసి ఆస్వాదించారు. డాడ్జర్స్‌ గేమ్‌కు వెళ్లారు. 

జూ¯Œ  3, 2018
బర్గర్స్‌ అండ్‌ చానెల్‌ .. మై ఫేవరేట్‌ కాంబో విత్‌ మై ఫేవరేట్‌ గర్ల్స్‌ అంటూ తన సఖులతో కలిసి బర్గర్‌ తింటున్న ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చూసి ముచ్చటపడ్డాడు జోనస్‌. ‘లవ్‌ దట్‌ స్మైల్‌’ అని స్పందించాడు కూడా. జోనస్‌.. ప్రియాంక నవ్వుకిచ్చిన కితాబుకు దాదాపు 32 వేల లైక్స్‌ మురిశాయి. 2,656 రిప్లైస్‌ కురిశాయి. ఒక ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ అయితే ఏకంగా ‘‘నియాంక (నిక్‌ అండ్‌ ప్రియాంక)’’ అని నామకరణం కూడా చేసేశాడు వాళ్లిద్దరికీ. 

జూన్‌ 6, 2018
ప్రియాంక కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో నిక్‌ను లవ్వాడిన సందర్భం ఇది. జూన్‌ ఆరున.. అ అబ్బాయి ఫొటోకి ‘‘ఎవరీ అందగాడు? లాల్‌’’ అంటూ కాంప్లిమెంట్‌ ఇచ్చింది. 

జూన్‌ 9, 2018
న్యూజెర్సీలోని అట్లాంటిక్‌ సిటీలో జరిగిన తన కజిన్‌ పెళ్లికి ప్రియాంకను ఆహ్వానించాడు జోనస్‌. ఆ పెళ్లిలో ఈ ఇద్దరూ కలిసి సందడి చేశారు. తన అన్నదమ్ములైన కెవిన్, బోనస్‌లనూ ప్రియాంకకు పరిచయం చేశాడు జోనస్‌. 

జూన్‌ 22, 2018
రాత్రి పూట బాల్కనీలో నడుస్తూ నవ్వుతున్న ప్రియాంక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు జోనస్‌. ఆ వీడియోలో ఆమె పక్కన ‘‘హర్‌’’ అనే అక్షరాలు.. హార్ట్స్‌ కళ్లుగా ఉన్న రెండు ఇమోజీలనూ క్యాప్షన్‌గా పెట్టాడు. ప్రియాంక వాళ్లమ్మను కలవడానికి జోనస్‌ ముంబై వెళ్లినప్పుడు అతను ఈ వీడియో తీసుంటాడని అభిమానులు చెప్పుకున్నారు. ఏమైనా జోనస్‌ ఈ లవ్‌ స్టోరీ వీడియో చాలా పాపులర్‌ అయింది. 

జూన్‌ 27, 2018
బీచ్‌లో సముద్రానికి మొహం చేర్చి నిలబడ్డ జోనస్, ప్రియాంక వాళ్ల బ్రదర్‌ ఫొటోస్‌.. వాటికి హార్ట్‌ అయిస్‌ (్ఛy్ఛట) ఇమోజీతో మై ఫేవరెట్‌ మెన్‌ అంటూ క్యాప్షన్‌ రాసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది ప్రియాంక. అది గోవా బీచ్‌ అని, ఆ పోస్ట్‌ను బట్టి.. నిక్‌– ప్రియాంక చాలా తరచుగా ఇండియా వస్తూ వెళ్తున్నారని తేలిపోయింది.

జూలై 27, 2018
గోవా పోస్ట్‌ తర్వాత నెలకు.. జోనస్‌ న్యూయార్క్‌లోని టిఫనీ స్టోర్‌లో కనిపించాడని.. అక్కడ ప్రియాంకకు రెండు లక్షల డాలర్ల విలువ చేసే డైమండ్‌ రింగ్‌ కొన్నాడని.. అది కచ్చితంగా ఎంగేజ్‌మెంట్‌ రింగేనని.. వాళ్ల ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందనీ రూమర్స్‌ వచ్చాయి. ‘‘ఇంత సంతోషంగా జోనస్‌ను మేమెప్పుడూ చూడలేదు. ప్రియాంక మీద అతని ప్రేమ చాలా సీరియస్‌’’ అని జోనస్‌ కుటుంబం, ఫ్రెండ్స్‌ అన్నట్లు ఫారిన్‌ మీడియా కూడా ఉప్పందించింది. 

ఆగస్ట్‌ 18, 2018
అభిమానులు.. పేక్షకులు.. జనాలు అందరి ఆలోచనలు, మాటలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా ముంబైలోని తనింట్లో జోనస్‌తో నిజంగానే నిశ్చితార్థం జరుపుకుంది ప్రియాంక. ఈ వేడుకకు జోనస్‌ తల్లి ప్రియాంక కోసం టిఫనీ స్టోర్స్‌ నుంచే డైమండ్‌ నెక్లెస్‌ను తెచ్చి కానుకగా ఇచ్చిందనీ వార్త. ప్రియాంక, జోనస్‌.. గోడ మీద ఎన్‌పీ అని అక్షరాలను అలంకరించిన చోట ఒకరి కళ్లలోకి ఒకరు ఆప్యాయంగా చూసుకుంటూ దిగిన ఫొటోను ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసుకున్నారు. కాకపోతే క్యాప్షన్సే వేరు... ‘‘టేకెన్‌ విత్‌ ఆల్‌ మై హార్ట్‌ అండ్‌ సోల్‌ ’’ అని ప్రియాంక, ‘‘ఫ్యూచర్‌ మిసెస్‌ జోనస్‌. మై హార్ట్‌. మై లవ్‌’’ అని జోనస్‌ ప్రేమగా రాసుకున్నారు.

నిక్‌ జోనస్‌.. బ్యాగ్రౌండ్‌
25 ఏళ్ల మల్టీ టాలెంటెడ్‌ హంక్‌. పేరు ప్రఖ్యాతులున్న అమెరికన్‌ గాయకుడు, పాటల రచయిత, నటుడు, రికార్డ్‌ ప్రొడ్యూసర్‌. బేస్‌బాల్‌ అంటే ప్రాణం. సింగర్‌ కాకపోయి ఉంటే ప్రొఫెషనల్‌ బేస్‌బాల్‌ ప్లేయర్‌ని అయ్యేవాడిని అంటాడు. ఇంకో విషయం.. నిక్‌ జోనస్‌ టైప్‌ 1 డయాబెటిక్‌. 2007లో ఆయన ఒంట్లోంచి ఈ విషయం బయటపడింది. డయాబెటిస్‌ మీద అవగాహన కల్పించడం  కోసం ఓ ఫౌండేషన్‌ను స్థాపించారు జోనస్‌ అండ్‌ బ్రదర్స్‌. జోనస్‌ ప్రియాంకకంటే ముందు ఇద్దరమ్మాయిలతో డేటింగ్‌ చేశాడు. వాళ్లలో 2012 మిస్‌ యూనివర్స్‌ ఒలీవియా కల్పో ఒకరు. ఆమె జోనస్‌ మ్యూజిక్‌ వీడియో ‘జెలస్‌’లోనూ నటించింది. మైలీ సైరస్, సెలెనా గోమేజ్‌లతో లవ్‌ ట్రయాంగిల్‌ నడిపాడనే నిందా ఉంది జోనస్‌ మీద. మరో విషయం ఏంటంటే ప్రియాంకలా అతని గర్ల్‌ ఫ్రెండ్స్‌ అందరూ జోనస్‌ కన్నా పెద్దవాళ్లేనట. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement