అమ్మో... మరీ ఇంతలానా? | sradha kapoor stunts for add shooting | Sakshi
Sakshi News home page

అమ్మో... మరీ ఇంతలానా?

Published Sat, Jan 9 2016 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

అమ్మో... మరీ ఇంతలానా?

అమ్మో... మరీ ఇంతలానా?

వన్ ఫైన్ మార్నింగ్... ముంబైలోని  34 అంతస్తుల ఫేమస్ ఫైవ్ స్టార్ హోటల్. 34వ అంతస్తు నుంచి కిందకి చూడాలంటేనే గుండె జారిపోతుంది. అలాంటిది ఆ అంతస్తు  పై నుంచి ఓ అమ్మాయి... ఇద్దరి సాయంతో కిందకు వేలాడుతూ, యాక్షన్ చేస్తున్నారు. దారిన పోయేవాళ్లందరూ టెన్షన్‌గాచూస్తున్నారు. ఏదైనా సినిమా షూటింగ్ కోసమేనేమో అనుకున్నారంతా! కానీ అదంతా కేవలం యాడ్ చిత్రీకరణ కోసమే.
 
  ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు శ్రద్ధాకపూర్.  ఓ ప్రొడక్ట్‌కు సంబంధించిన వాణిజ్యప్రకటన కోసం రిస్కీ షాట్‌లో నటించడానికి ఆమె రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలను తన ట్విటర్లో ‘సో... వెయిట్‌లెస్..’అంటూ షేర్ చేశారామె. అమ్మో...అంత రిస్కా అని సన్నిహితులు అంటున్నా, శ్రద్ధా కపూర్ మాత్రం మరేం ఫరవాలేదంటున్నారు. ‘ఆషికీ-2’ చిత్రంతో డ్రీమ్‌గాళ్‌గా ప్రేక్షకుల హృదయాలను మీటిన శ్రద్ధాకపూర్ తన ఇమేజ్‌ను అంచెలంచెలుగా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే డాన్స్ నేపథ్యంలో ‘ఏబీసీడీ-2’ నటించారు.  ఇప్పుడు తాను నటిస్తున్న ‘బాగీ’ చిత్రంలో కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. అందుకేనేమో యాక్షన్ సీన్లలో నటించడానికి సై అంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement