శ్రీకాంత్ కథానాయకునిగా ‘క్షత్రియ’ | Srikanth as Kshatriya in AVM Movies film | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్ కథానాయకునిగా ‘క్షత్రియ’

Published Wed, Sep 11 2013 1:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

శ్రీకాంత్ కథానాయకునిగా ‘క్షత్రియ’

శ్రీకాంత్ కథానాయకునిగా ‘క్షత్రియ’

శ్రీకాంత్ కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం ‘క్షత్రియ’. కుంకుమ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఉదయ్‌చంద్ దర్శకుడు. మహేంద్రవర్మ, మొదుళ్ల జయేందర్‌రెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘టైటిల్‌కి తగ్గట్టే ఇందులో శ్రీకాంత్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. 
 
 ఆయన కెరీర్‌లోనే ఇది గొప్ప పాత్ర అని కచ్చితంగా చెప్పగలం. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది. విశ్వ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెలాఖరున విడుదల చేస్తాం. 
 
 అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజు తోట, కళ: సాయిమణి, కూర్పు: శంకర్, లైన్ ప్రొడ్యూసర్: తమ్మినీడి సతీష్‌బాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement