Kumkum
-
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
విడాకులు అనే పదం ఈ రోజుల్లోనే కామన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పెళ్లైన కొన్నేళ్లలోనే పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేస్తున్నారు. అలా తాజాగా ప్రముఖ బుల్లితెర నటి తన వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్ బుల్లితెర నటి ముగ్ధా చాఫేకర్ విడాకులు తీసుకున్నట్లు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రవీశ్ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత భర్త రవీశ్ దేశాయ్‌తో విడిపోయింది.రవీశ్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "చాలా ఆలోచనల తర్వాత, ముగ్ధ , నేను మా సొంత మార్గాల్లో ప్రయాణించేందుకు నిర్ణయించుకున్నాం. అందుకే భార్య,భర్తలుగా విడిపోవాలని డిసిషన్ తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పట్టింది. ఇప్పటివరకు పరస్పరం ప్రేమ, స్నేహం, గౌరవంతో కలిసి ప్రయాణించాం. ఆమెతో ఉన్న రోజులు జీవితాంతం గుర్తుంటాయి." అని పోస్ట్ చేశారు. ఈ సమయంలో తమకు గోప్యత కావాలని అభిమానలను అభ్యర్థించాడు. అభిమానులు, మీడియా మాపై దయతో మద్దతుగా ఉండాలని.. ఎటువంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని నటి భర్త కోరారు.కాగా.. రవీశ్ దేశాయ్, ముగ్ధా చాఫేకర్ 2014లో సత్రంగి ససురల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ సీరియల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత డిసెంబరు 2016లో ముంబయిలో జరిగిన గ్రాండ్ వేడుకలో వీరి వివాహం జరిగింది. ప్రముఖ టీవీ సీరియల్ కుంకుమ భాగ్య సీరియల్లో ప్రాచీ మెహ్రా కోహ్లి పాత్రకు గానూ ముగ్ధా చాఫేకర్ బాగా ఫేమస్ అయింది. అలాహే రవీశ్ దేశాయ్ మేడ్ ఇన్ హెవెన్, షీ (సీజన్ 2), స్కూప్ లాంటి వెబ్ సిరీస్‌ల్లో కనిపించారు. చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా విజయ్ 69లో కనిపించారు. -
‘పొడుగు బొట్లను చూస్తే భయమేస్తుంది’
బాదామి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో పలు వివాదాలు కేంద్ర బిందువుగా నిలిచిన ఆయన.. తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నుదిటిపై కుంకుమ బొట్టు, విభూది పెట్టుకునేవారిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్దరామయ్య మంగళవారం బాదామిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా అర్చకులు తొలుత పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రసంగించిన సిద్దరామయ్య.. నుదుటిపై పొడవాటి బొట్టు పెట్టుకున్న ఓ వ్యక్తిని చూపిస్తూ బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేశారు. ‘నుదుటిపై పొడవైన కుంకుమ బొట్లు, విభూది పెట్టుకున్న వారిని చూసి నేను భయపడుతున్నాను. మీరు నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అయితే సక్రమంగా పని చేస్తారా?. ఎవరైనా సరే సకాలంలో వారికి కేటాయించిన పనిని సక్రమంగా పూర్తి చేయాలి. నుదిటిపై పొడవైన బొట్లు పెట్టుకున్నవారిని చూస్తే నాకు ఎందుకు భయమేస్తుందో అర్థం కావడం లేద’ని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు సిద్దరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WATCH Former Karnataka CM and Congress leader Siddaramaiah, says, "I am scared of people who put long tikas with kumkum or ash", at an event, in Badami, Karnataka, yesterday pic.twitter.com/2UMjVI3DkL — ANI (@ANI) 6 March 2019 -
2014లో తొలి సినిమా
కొత్త సంవత్సరానికి శ్రీకాంత్ శుభారంభం పలకబోతున్నారు. 2014 జనవరి 1న శ్రీకాంత్ హీరోగా నటించిన ‘క్షత్రియ’ చిత్రం విడుదల కాబోతోంది. నిధి అన్వేషణే ప్రధానాంశంగా ఈ చిత్రం రూపొందింది. కుంకుమ్ కథానాయిక. కె.ఉదయ్‌చంద్ దర్శకుడు. మహేంద్రవర్మ, మొదుళ్ల జియేందర్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ప్రివ్యూను హైదరాబాద్‌లో తిలకించిన శ్రీకాంత్... ప్రేక్షకులకు తప్పక నచ్చే సినిమా ఇదని నమ్మకం వ్యక్తం చేశారు. సస్పెన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శ్రీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాజు తోట, సంగీతం: విశ్వ. -
‘క్షత్రియ’ సినిమా స్టిల్స్
శ్రీకాంత్, కుంకుమ్ జంటగా కె.ఉదయ చందు దర్శకత్వంలో వి.మహేందర్-మొదుళ్ల జయేందర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘క్షత్రియ’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. డి.రామానాయుడు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజ్‌కు అందించారు. ఇందులో పాటలు ఆకట్టుకుంటాయని సంగీత దర్శకుడు విశ్వ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా సాగర్, భరద్వాజ్, వీరశంకర్, మల్టీ డెమైన్షన్ వాసు, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు. -
చాలా థ్రిల్లింగ్‌గా ఉంది - శ్రీకాంత్
‘‘ఈ కథ చాలా కొత్తగా అనిపించింది. అలాగే చాలా థ్రిల్లింగ్‌గా కూడా అనిపించింది. నేను ఇటువంటి థ్రిల్లర్ మూవీ చేయడం ఇదే తొలిసారి’’ అని శ్రీకాంత్ చెప్పారు. శ్రీకాంత్, కుంకుమ్ జంటగా కె.ఉదయ చందు దర్శకత్వంలో వి.మహేందర్-మొదుళ్ల జయేందర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘క్షత్రియ’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. డి.రామానాయుడు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజ్‌కు అందించారు. ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘శ్రీకాంత్ 110 సినిమాలు చేసినప్పటికీ తన మొదటి సినిమా సమయంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అతను 200 సినిమాలు పూర్తి చేయాలి’’ అని అన్నారు. ఇందులో పాటలు ఆకట్టుకుంటాయని సంగీత దర్శకుడు విశ్వ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా సాగర్, వీరశంకర్, మల్టీ డెమైన్షన్ వాసు, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు. -
శ్రీకాంత్ కథానాయకునిగా ‘క్షత్రియ’
శ్రీకాంత్ కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం ‘క్షత్రియ’. కుంకుమ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఉదయ్‌చంద్ దర్శకుడు. మహేంద్రవర్మ, మొదుళ్ల జయేందర్‌రెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘టైటిల్‌కి తగ్గట్టే ఇందులో శ్రీకాంత్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఆయన కెరీర్లోనే ఇది గొప్ప పాత్ర అని కచ్చితంగా చెప్పగలం. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది. విశ్వ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెలాఖరున విడుదల చేస్తాం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజు తోట, కళ: సాయిమణి, కూర్పు: శంకర్, లైన్ ప్రొడ్యూసర్: తమ్మినీడి సతీష్‌బాబు.